IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మరికొన్ని గంటల్లో ప్రారంభం అవుతుంది. దీంతో జనాలందరూ ఎంతో ఆత్రుతగా ఈ మ్యాచ్ ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కొనసాగుతుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది.
Also Read: SRH – Travis Head: SRHను చూస్తేనే వణకు పుట్టాల్సిందే…ఈ సారి 400 కొట్టడం పక్కా…?
అయితే ఇలాంటి ఈ షెడ్యూల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో ( Kolkata Knight Riders Vs Lucknow Super Giants ) మధ్య జరిగే మ్యాచ్ రీ షెడ్యూల్ చేశారు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు. ముందుగా ప్రకటించిన తేదీనే… మ్యాచ్ జరుగుతుంది కానీ వేదిక మాత్రం మార్చారు. ఏప్రిల్ ఆరవ తేదీన ఈడెన్ గార్డెన్స్ లో…. కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఈ వేదికను గువా హటికి షిఫ్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అంటే మార్చి ఆరవ తేదీనే… గువా హటికి చెందిన స్టేడియంలో కేకేఆర్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆ రోజున శ్రీరామనవమి ఉన్న నేపథ్యంలో కోల్కతాలో భారీగా ఊరేగింపులు ఉంటాయి.
Also Read: Chahal T-shirt: ఎవడి డబ్బు వాడే సంపాదించుకోవాలి..చాహల్ టీ-షర్ట్ ఫోటో వైరల్ ?
అయితే శ్రీరామనవమి ఉన్న నేపథ్యంలో.. ఈడెన్ గార్డెన్స్ లో జరిగే లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్ను రద్దు చేసుకోవాలని పశ్చిమబెంగాల్ పోలీసులు రిక్వెస్ట్ చేశారు. ఆ రోజున భద్రతను స్టేడియం వద్ద ఉంచలేమని…. తగినంత ఫోర్సు తమ దగ్గర లేదని కూడా తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి… ప్రమాదాలు జరగకూడదని… భద్రతా కారణాల వల్ల…. మ్యాచ్ రద్దు చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలిని కోరారు బెంగాల్ పోలీసులు. అయితే దీనిపై ఆలోచించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి భద్రతా కారణాల వల్ల మ్యాచ్ ను షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చింది.
మార్చి ఆరవ తేదీనే గువా హటికి మార్చేశారు. గతంలో కూడా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అచ్చం ఇలాగా వాయిదా వేయడం జరిగింది. అదే సమయంలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైట్ జరగనుంది. అయితే ఈ తొలి మ్యాచ్ కు కూడా వర్షం అడ్డంకిగా మారనుంది. ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ చూడాలని టికెట్లు బుక్ చేసుకున్నామని.. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే తమకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.