BigTV English

Revathi: ఇష్టం లేకుండానే ఆ సినిమాల్లో నటించాను, చాలా బాధపడ్డాను.. సీనియర్ నటి స్టేట్‌మెంట్

Revathi: ఇష్టం లేకుండానే ఆ సినిమాల్లో నటించాను, చాలా బాధపడ్డాను.. సీనియర్ నటి స్టేట్‌మెంట్

Revathi: ఎన్నో ఆశలతో హీరో, హీరోయిన్లుగా అడుగుపెట్టిన తర్వాత చాలావరకు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అలా కొన్నిసార్లు స్టార్లు కూడా తమకు నచ్చని పనులు చేయడం, నచ్చని సినిమాల్లో నటించడం చాలా కామన్. అలాంటి వాటి గురించి కొందరు ఓపెన్‌గా చెప్పినా చాలావరకు దీని గురించి మాట్లాడడానికి ఎవ్వరూ ఇష్టపడరు. తాజాగా ఒక సీనియర్ నటి మాత్రం కెరీర్ మొదట్లో తను ఇష్టం లేకుండా నటించిన సినిమాల గురించి ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంతే కాకుండా ఆ సమయంలో తను మానసికంగా ఎంత బాధపడిందో చెప్తూ ఫీలయ్యింది. ఆ సీనియర్ నటి మరెవరో కాదు.. సౌత్‌లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న రేవతి.


ఎన్నో అవార్డులు

మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది రేవతి. ఆ తర్వాత మెల్లగా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. కానీ రేవతి కూడా తన కెరీర్ మొదట్లో చాలామంది ఇతర అప్‌కమింగ్ హీరోయిన్స్‌లాగానే కష్టాలు పడిందని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇప్పటికే మోస్ట్ సక్సెస్‌ఫుల్ నటిగా సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు రేవతి. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన ఆమె.. ఇప్పుడు తల్లి పాత్రలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే తను తన నటనతో మూడు నేషనల్ అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, కేరళ స్టేట్ అవార్డ్ కూడా గెలుచుకుంది. అలాంటిది తాజాగా తన కెరీర్ మొదట్లో కష్టాల గురించి బయటపెట్టింది.


అప్పుడే నిర్ణయించుకున్నాను

‘‘నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అది డబ్బు సంపాదించడానికి మార్గం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ అదే చేసుంటే నేను సినిమాల గురించి చెప్పేది అబద్ధం అయ్యేది’’ అంటూ అసలు సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు తను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు రేవతి. ‘‘అది చాలా కష్టమైన సమయం. నేను అసలు దేని గురించి బాధపడుతున్నానో ఎవ్వరికీ తెలియదు. నాకు వేరే దారి లేనప్పుడు నాకు నచ్చని రెండు సినిమాల్లో నటించాను. అది నాకు బాధనిపించింది. కానీ అప్పటినుండి నేను నా ఛాయిస్‌లపై మాత్రమే ఆధారపడడం మొదలుపెట్టాను. నేను నమ్మే పాత్రలు మాత్రమే యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను’’ అని గుర్తుచేసుకున్నారు రేవతి (Revathi).

Also Read: అలాంటివి నేను సపోర్ట్ చేయను.. ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన చిరంజీవి

సంతోషంగా అనిపిస్తుంది

‘‘చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నేను చేసిన పాత్రలంటే ఇష్టమని, వాటిలో నటించాలని ఉందని చెప్తుంటారు. అవి విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది’’ అని సంతోషం వ్యక్తం చేశారు రేవతి. అప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా తనకు సూట్ అయ్యే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంటారు ఈ సీనియర్ నటి. తమిళ, మలయాళంలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా ఇప్పటికీ తల్లి పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఆమెకు ఉన్న ఫ్యాన్ బేస్ ఇప్పటికీ మాలీవుడ్‌లో ఏ మాత్రం తగ్గలేదు. తెలుగులో వెంకటేశ్‌తో ‘ప్రేమ’ అనే మూవీలో రేవతి నటనకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×