Chahal T-shirt: టీమిండియా క్రికెట్ లో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. మరో టీమ్ ఇండియా ఆటగాడు విడాకులు తీసుకున్నాడు. మొన్నటి వరకు ప్రచారం జరిగిన యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) అలాగే ధన శ్రీ వర్మ ( Dhana shree Verma )… విడాకులు ఖరారు అయ్యాయి. టీమిండియా స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అధికారికంగానే.. ఇవాళ ఈ ఇద్దరికీ ముంబైలోని ఫ్యామిలీ కోర్టు (Family Court) తీర్పు ఇచ్చింది. దింతో వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన… ముంబైలోని ఫ్యామిలీ కోర్టు… మరో కీలక ప్రకటన కూడా చేసింది. అక్షరాల RS. 4.75 కోట్లు భరణం.. ధనశ్రీ వర్మ కు యుజ్వేంద్ర చాహల్ ఇవ్వాలని… ఆదేశాలు ఇచ్చింది.
Also Read: Team India Cash prize: టీమిండియాకు BCCI భారీ నజరానా..ICC కంటే ఎక్కువే.. ఎన్ని కోట్లంటే ?
ఇక ఆ మొత్తం డబ్బును ఒకేసారి చెల్లించేందుకు చాలు కూడా ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఇందులో కొంత మొత్తాన్ని కూడా యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) అందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తీర్పు వచ్చేవరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ).. జాయిన్ కాలేదు యుజ్వేంద్ర చాహల్. ఇక ఇవాళ… తన విడాకుల అంశం పూర్తి కావడంతో.. నేరుగా వెళ్లి ఐపీఎల్ ఆడబోతున్నాడు. Chahal-Dhanashree divorce
ఇది ఇలా ఉండగా… ఇవాళ కోర్టులో విడాకులపై తుది తీర్పు ఉన్న నేపథ్యంలో…. టీమిండియా స్పిన్నర్ చాహల్… తన మాజీ భార్య ధనశ్రీ వర్మకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. విడాకులు ఎలాగైనా మంజూరు అవుతాయని ముందే ఊహించిన చాహల్… అదిరిపోయే టీషర్ట్ వేసుకొచ్చాడు. తన భార్యకు కౌంటర్ ఇస్తూ.. టీ షర్టు పైన ధనశ్రీ వర్మ కు కోపం వచ్చేలా ఒక కోట్ కూడా రాసుకోవచ్చాడు. మీ డబ్బులు మీరే సంపాదించుకోవాలి… ఇతరులపై ఆధారపడకూడదు… మీ కాళ్ళపై మీరే నిలబడి సంపాదించుకోవాలి.. అనే సంకేతం వచ్చేలా ఇంగ్లీషులో ఒక కోట్ రాసుకోచ్చాడు చాహల్.
మొదట కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు… లోపల ఉన్న టీ షర్ట్ కనిపించకుండా జాకెట్ వేశాడు చాహల్. ఎప్పుడైతే కోర్టు తీర్పు ఇచ్చిందో… ఆ తర్వాత బయటికి వచ్చేటప్పుడు పైన తన జాకెట్ తీసేశాడు. అప్పుడు లోపల ఉన్న టీ షర్ట్ పైన.. ధనశ్రీ వర్మ కు కౌంటర్ ఇచ్చేలా ఓ quote కనిపించింది. దీంతో ఇది తన మాజీ భార్య ధనశ్రీ వర్మ కోసమే చాహల్… రాసుకు వచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు. అయితే వాస్తవంగా విడాకులు అంశం తెరపైకి రావడంతో దాదాపు 60 కోట్లు డిమాండ్ చేసిందట ధనశ్రీ వర్మ. కానీ దానికి చాహలు ఒప్పుకోలేదట. దీంతో నాలుగు కోట్ల 75 లక్షలకు… కోర్టు తీర్పు ఇచ్చింది.
Also Read: SRH – Travis Head: SRHను చూస్తేనే వణకు పుట్టాల్సిందే…ఈ సారి 400 కొట్టడం పక్కా…?
Yuzi Chahal visited the court wearing 'be your own sugar daddy'. pic.twitter.com/XPtEMflVt5
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2025