Danish Kaneria On Modi : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఘటన పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. అయితే పాకిస్తాన్ కి చెందిన మాజీ క్రికెటర్ భారత ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశాడు. పాక్ క్రికెటర్ దానిస్ కనేరియా మోదీ ఇంగ్లీషులో ప్రసంగిస్తూ హెచ్చరికలు చేయడం పై దానిష్ ప్రశంసలు కురిపించారు. గాజాలో మాదిరిగానే ఇక్కడ కూడా ఉగ్రవాద ముగింపునకు ఇది నాంది అని ఆశీస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు క్రికెటర్ దానిష్.
Also Read : Riyan Parag : బెంగుళూరు గెలవాలని రియాన్ పరాగ్ రచ్చ… షాక్ లో రాజస్థాన్
“నేను ఇక్కడ పాకిస్తాన్ లేదా దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఉగ్రవాదం చేతిలో పాక్ తీవ్రంగా బాధపడుతోంది. శాంతి కోసం నిలబడే నాయకత్వం అవసరం ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేవారు కాదు.నేను గర్వంగా పాక్ క్రికెట్ జెర్ససీని ధరించాను. మైదానంలో నా చెమటను చిందించా. చివరికీ నన్ను ట్రీట్ చేసిన విధానం కూడా పహల్గామ్ బాధితులకు భిన్నంగా లేదు. హిందువుగా ఉన్నందుక లక్ష్యంగా మారా. ఉగ్రవాదాన్ని సమర్థించే వారు సిగ్గు పడాలి. హంతకులను రక్షించే వారు సిగ్గుపడాలి. నేను ఎప్పుడైనా మానవత్వం, వాస్తవం వైపే నిలబబడతా. పాకిస్తాన్ ప్రజలు కూడా ఇలాగే ఉంటారని భావిస్తున్నా. వారిని తప్పు దోవ పట్టించొద్దు” అని ట్వీట్ చేశాడు దానిష్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మరోవైపు ప్రధాని మోదీ ప్రసంగాన్ని పరిశీలించినట్టయితే.. జమ్మూ కాశ్మీర్ లో పలు రాష్ట్రాలకు చెందిన అమాయక ప్రజల ప్రాణాలను హరించిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వెతికి మరీ శిక్షిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముష్కరులకు, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠినంగా శిక్ష విధిస్తామన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బిహార్ లోని మధుబనిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రవాదుల దాడిని ప్రస్తావిస్తూ హంతకులు భారీ మూల్యం చెల్లించుకోకయ తప్పదని హెచ్చరించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉందని తెలిపారు. ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి తన కుమారుడిని కోల్పోయింది. ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడు. కార్గిల్ నుంచి కాశ్మీర్ వరకు ప్రతీ ఒక్కరిలో కూడా బాధ, ఆగ్రహం ఉన్నాయి.
ఇది కేవలం పర్యాటకులపై జరిగినటువంటి దాడి మాత్రమే కాదు. భారత ఆత్మ పై దాడి చేసేందుకు శత్రువులు చేసిన దుస్సాహసమని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్తితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉంది. ఉగ్రమూకల వెన్నెముకకు 140 కోట్ల మంది ప్రజలు విరిచేస్తారని ప్రధాని స్ట్రాంగ్ గా హెచ్చరించారు. అలాగే భారత్ కి అండగా నిలిచిన దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రధాని హిందీలో ప్రసంగిస్తుంటారు. కానీ నిన్న అరుదైన రీతిలో ఒక్కసారిగా తన ప్రసంగాన్ని హిందీ నుంచి ఇంగ్లీషులోకి మార్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన సందేశాన్ని ప్రపంచ దేశాలకు సూటిగా చెరవేసేందుకు ఇంగ్లీషులో మాట్లాడినట్టు తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. అభినందించిన పాక్ మాజీ క్రికెటర్
భారత ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్నానంటూ సంచలన ప్రకటన చేసిన పాక్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా
మోదీ ఇంగ్లీష్‌లో ప్రసంగిస్తూ హెచ్చరికలు చేయడంపై దానిష్ ప్రశంసలు
గాజాలో… pic.twitter.com/g6PQvMDD5U
— BIG TV Breaking News (@bigtvtelugu) April 25, 2025