Chinmayi Sripada: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదn(Chinmayi Sripada) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. భారతీయ భాష శాస్త్రవేత్తగా పేరు దక్కించుకున్న ఈమె సంగీత విద్వాంసురాలు కూడా. సినీ గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు డబ్బింగ్ చెప్పి, ఎన్నో నంది అవార్డులు కూడా గెలుపొందింది. భారతీయ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న ఈమె తన ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha) కు డబ్బింగ్ చెబుతూ.. డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు సొంతం చేసుకోవడమే కాకుండా సమంతతో మంచి సాహిత్యం కూడా ఏర్పరచుకుంది. ఇక ప్రముఖ నటుడు, డైరెక్టర్ అయిన రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) తో ఏడడుగులు వేసిన ఈమెకు ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు.
మతం చూసి కాదు.. కులం చూసి చంపేస్తున్నారు..
ఇకపోతే సింగర్ చిన్మయి ఎక్కువగా సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆడవారి జోలికి, చిన్నపిల్లల జోలికి ఎవరైనా వస్తే మాత్రం అసలు ఊరుకోదు. తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ.. ఎదుటివారికి చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఇప్పుడు పహల్గామ్ దాడి గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ.. మతం చూసి కాదు ఆధిపత్యం చెలాయిస్తూ కూడా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పంచుకుంది చిన్మయి.
మానసిక హత్యలు చేస్తున్న వారు కూడా ఉగ్రవాదులే..
తాజాగా చిన్మయి షేర్ చేసిన పోస్ట్ విషయానికి వస్తే.. ఒక వ్యక్తి తనతో చెప్పినట్టుగా ఆ విషయాన్ని తెలిపింది. చిన్మయి తన ఇంస్టాగ్రామ్ ద్వారా.. “నేను ఒక తక్కువ కులానికి చెందిన వాడిని. అది కూడా షెడ్యూల్డ్ తెగ. హిందువులు అని పిలువబడే వారు నేను కూడా వారిలో ఒకడిని అని మర్చిపోయారు. మా గ్రామంలో నేను గుడికి వెళ్తే పూజారి నేరుగా నాకు ప్రసాదం ఇవ్వలేదు. ఇది నేను చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్నదే. అయితే అటు కాలేజీ రోజుల్లో కూడా ఈ వివక్షతను నేను చూశాను. ఒకరోజు బాధగా అనిపించి మా ప్రొఫెసర్ తో ఈ విషయాన్ని చెబితే, నేను కూడా ఇలా ఎన్నో ఎదుర్కొన్నాను అంటూ ఆయన తెలిపారు. హిందువులమే కానీ కులం పేరిట మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఇలా చెప్పడం బాధగా అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్న అగ్రకులాలకు, అగ్రవర్ణాలకు చెందిన వారు కులాన్ని బట్టి వివక్ష చూపేవారు ఉగ్రవాదులతో సమానం అని నాకు ఎన్నోసార్లు అనిపించింది. ఎందుకంటే అవి నా మానసిక ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేశాయి. కానీ ఇప్పటివరకు కుల, ఆధారిత సినిమాలు ఏవి రాలేదు. రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదు.. మతం ఆధారంగా హత్య చేస్తే, మరికొందరు ఆధిపత్యం ఆధారంగా మానసిక ఆరోగ్యాన్ని చంపేస్తున్నారు” అంటూ ఒక వ్యక్తి చెప్పినట్టుగా ఆ విషయాన్ని చిన్మయి శ్రీపాద తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఏది ఏమైనా పహాల్గామ్ లో మతం ఆధారంగా హత్య చేస్తే ఇక్కడ హిందువులలో కూడా కులం ఆధారంగా మానసిక హత్యలు చేస్తున్నారు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది చిన్నయి. మరి దీనిపై నెటిజన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
ALSO READ:DPIFF: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ కి కిరణ్ అబ్బవరం మూవీ… కెరీర్‌లో ఫస్ట్ టైం..?