IPL 2025 playoffs : ఐపీఎల్ 2025 సీజన్ లో ఏ టీమ్ ఎప్పుడూ విజయం సాధిస్తుందో అసలు ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సులభంగా గెలిచే మ్యాచ్ లను చేజేతులారా ఓటమి పాలవుతున్నారు. నిన్న ఆదివారం కావడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. మళ్లీ కొద్ది గంటల్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ రెండో స్థానం, రెండో స్థానంలో ఉన్న ముంబై మూడో ఇలా స్థానాలు అన్ని తారు మారయ్యాయి.
ఇక పాయింట్ల పట్టికను ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే.. మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో ప్లే ఆప్స్ కి వెళ్లడం చాలా కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ ఆశలు లేవని పలువురు క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. చివరి నుంచి 4 స్థానాల్లో ఈ జట్లు కొనసాగుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, డిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ ల ఆధారంగా ఈ అంచెనా వేశారు. పంజాబ్ కింగ్స్ కాస్త పుంజుకుంటే.. ఢిల్లీ ముంబై జట్లలో ఒక జట్టు ప్లే ఆప్స్ నుంచి వెనక్కి వచ్చే అవకాశముంది.
పంజాబ్ పుంజుకోకుంటే పంజాబ్ కూడా ఇంటి దారి పట్టే ఛాన్స్ ఉంది. అయితే ఐపీఎల్ 2025 సీజన్ లో తమ చెత్త ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దాదాపు ప్లే ఆప్స్ అవకాశాలు కోల్పోయినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ జట్టుకు మాత్రం 0.03 శాతం మాత్రమే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 90 శాతం ప్లే ఆప్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందని.. ఆ తరువాత గుజరాత్ టైటాన్స్ 87 శాతం, ఢిల్లీ క్యాపిటల్స్ 75 శాతం, ముంబై ఇండియన్స్ 64 శాతం, పంజాబ్ కింగ్స్ 58 శాతం, లక్నో 19 శాతం, కోల్ కతా 6 శాతం, హైదరాబాద్ 1 శాతం, రాజస్థాన్ 0.1 శాతంలో ఉన్నాయి. చివరి నుంచి నాలుగు టీమ్ లను వదిలేస్తే.. మిగిలిన జట్లక సంబంధించి కాస్త పర్సెంటేజీ అటు ఇటు కావచ్చు. లేదా టీమ్ లు తమ ప్రదర్శనను బట్టి అటు ఇటు మారే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ గత ఏడాది ఫైనల్ కి వెళ్లి ఓటమి పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో ప్లే ఆప్స్ కి కూడా చేరకుండానే ఇంటికి వెళ్లనుందని చెప్పకనే చెప్పవచ్చు.