Geetha Madhuri On Singer Pravasthi: గత కొన్ని రోజులుగా సింగర్ ప్రవస్థి విషయం సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రియాలిటీ షో పాడుతా తీయగా మేనేజ్మెంట్ జడ్జెస్ తనకు అన్యాయం చేశారని వాళ్ళపైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చాలామంది సింగర్లు రియాక్ట్ అయ్యారు. గీత మాధురి కూడా ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. “కొన్నిసార్లు మనం ఉన్న సిచువేషన్ వలన మామూలుగా మాట్లాడిన మాటలు కూడా మనకు మనం ఆపాదించుకుంటాం. అలా ఆపాదించుకోకు. మేము నీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నేను కూడా ఇలాంటి షోస్ నుంచి వచ్చాను కాబట్టి చెబుతున్నాను.
మేనేజ్మెంట్
కొన్నిసార్లు ఈ అమ్మాయి ఏ పాట పాడితే బాగుంటుంది అని సెలెక్ట్ చేయడంలో కూడా మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ల మధ్య ఎన్నో డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్లే కన్విన్స్ అయిపోయి వీళ్లకు నచ్చిన పాటలు పాడనిస్తారు. కొన్నిసార్లు వీళ్లే కన్విన్స్ అయి అవతల వాళ్ళు చెప్పిన పాటలు పాడుతుంటారు. ఇలాంటివన్నీ కూడా విజయానికి మెట్లు అనుకోవడమే, రియాలిటీ షో లోనే కాదు నిజజీవితంలో కూడా అలానే ఉండాలి. ఒక పాట పాడితే నెక్స్ట్ డే ఉంటుందో లేదో తెలియదు. ఉద్యోగంలో కూడా అలానే ఉంటుంది. చాలా రోజుల నుంచి ఈటీవీ తెలుసు. పాడుతా తీయగా కూడా తెలుసు. ఒకరికి బ్యాడ్ జరగాలి అని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అనుకోరు అంటూ గీతామాధురి తెలిపింది.
జడ్జెస్
చంద్రబోస్ గారు కానీ, సునీత గారు గాని, ఎం ఎం కీరవాణి గారు గానీ ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి అనుకునే వ్యక్తులు కాదు. వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఆ పర్టికులర్ టైంలో ఒకరు పాడిన పాట నచ్చకపోవటం వలన ఆ పర్సనాలిటీ మీద ఇష్టం ఉండదు అని అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ కంటెస్టెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక చిన్న కామెంట్ కూడా డిస్టబెన్స్ గా అనిపిస్తుంది. చిన్న కాంప్లిమెంట్ మళ్లీ హ్యాపీనెస్ ఇస్తుంది. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా పాజిటివ్ గా తీసుకోవాలి. దీనిని ఆసరాగా తీసుకొని చాలామంది సెలబ్రిటీలను పర్సనల్గా తిట్టడం కూడా మొదలుపెట్టారు. ఇప్పటివరకు లేని నెగెటివిటీ అంతా ఇప్పుడు బయటకు వస్తుంది మేబీ నేను తప్పై కూడా ఉండవచ్చు. కానీ ఇది నా ఒపీనియన్. ప్రవస్తీని తిట్టినా నాకు బాధగానే ఉంది, అలానే జడ్జెస్ చేసిన తిట్టినా నాకు బాధగానే ఉంది. అంటూ గీత మాధురి తెలిపింది.
Also Read : Puri Sethupathi : మాస్టర్ పీసా.? అప్పుడే డిసైడ్ చేశారా.? ముందు సినిమా సరిగ్గా తీయండి.