BigTV English

IPL 2025 Playoffs: ఐపిఎల్‌లో ప్లే ఆఫ్ చాన్సులు..ఏ టీమ్‌ ఏ స్థాయిలో ఉందంటే..

IPL 2025 Playoffs: ఐపిఎల్‌లో ప్లే ఆఫ్ చాన్సులు..ఏ టీమ్‌ ఏ స్థాయిలో ఉందంటే..

IPL 2025 Playoffs| ఐపిఎల్ 2025 ప్రారంభం అయినప్పడు తొలుత టాప్ లో ఉన్న టీమ్ లు చతికలపడ్డాయి. అలాగే ప్రారంభంలో తడబడ్డ జట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. దీంతో పాయింట్ల పట్టిక దాదాపు తలకిందులైంది. తాజాగా మంగళవారం జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితం తరువాత ఐపిఎల్ ప్లేఆఫ్స్ సినరియో దాదాపు తేలిపోయింది. కోల్ కతా జట్టు ఈ మ్యాచ్ లో అద్భుత విజయం నమోదు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానానికి జారిపోయింది. ఐపిఎల్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఢిల్లీ జట్టు చివరగా జరిగిన అయిదు మ్యాచ్ లలో మూడు సార్లు పరాజయం చవి చూడాల్సి వచ్చింది. ఢిల్లీ జట్టుకు పాయింట్ల పట్టికలో స్థానచలనం జరగడంతో ఒక్కసారిగా సమీకరణాలన్నీ మారిపోయాయి. దీంతో ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు పాయింట్ల పట్టికలో చివరగా టీమ్స్ కు అవకాశం లభించింది.


1.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).. ఈ జట్టు 14 పాయింట్లతో ఆల్రెడీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రజత్ పాటిదార్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ లో బెర్డ్ కన్ఫర్మ్ అయినట్లే. అయితే టాప్ 2లో ఉండేలా ఆర్ సిబి జట్టు ఇకపై కచ్చితంగా ఆడాలి. అప్పుడే ఫైనల్ కు వెళ్లే ఛాన్సులు మెరుగవుతాయి. ఇంకా ఆర్‌సిబి ఆడాల్సినవి నాలుగు మ్యాచ్ లున్నాయి. వీటిలో కనీసం రెండు గెలిచినా టాప్ 2 స్థానం కైవసం చేసుకున్నట్లే.

2.ముంబై ఇండియన్స్.. ఆడిన 10 మ్యాచ్ లలో ఆరు మ్యచ్ లలో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్ గత అయిదు మ్యాచ్ లను వరుసగా గెలుచుకొని వేగంగా పాయింట్లు సాధించింది. ఇక మిగిలిన 4 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు కచ్చితంగా గెలిస్తే టాప్ 4 లో స్థానం ఉంటుంది. కనీస సందర్భంతో మరో రెండు మ్యాచ్ లలో అయినా విజయం సాధించాలి.


3.గుజరాత్ టైటాన్స్.. శుభ్ మన్ గిల్స్ కెప్టెన్ గా మంచి జోష్ లో ఉన్న టీమ్ గుజరాత్ టైటాన్స్. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ లలో 6 గెలుచుకుంది. ఇంకా 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. మరో రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే ఆఫ్స్ లో స్థానం కొట్టేసినట్లే. ఒకవేళ మూడు గెలిస్తే ప్లే ఆఫ్ టాప్ 2లో ఉంటుంది. మంచి రన్ రేట్ కూడా ఉండడం ఈ టీమ్ కు ప్లస్ పాయింట్.

4.ఢిల్లీ క్యాపిటల్స్.. అందరూ ఈ టీమ్ టాప్ లో ఉంటుందని అంచనాలు వేయగా.. చివరగా ఆడిన 6 మ్యాచ్ లలో నాలుగింటిలో ఓటమి పాలైంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ టీమ్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. టోర్నమెంట్ ప్రారంభంలో అక్సర్ పటేల్ నాయకత్వంలోని ఈ టీమ్ అదరగొట్టింది. అందుకే ఇంకా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా ఆడాల్సిన 4 మ్యాచ్ లలో కనీసం రెండింటిలో గెలిస్తే ప్లే ఆఫ్స్ చాన్సులున్నాయి.

5. పంజాబ్ కింగ్స్.. 9 మ్యాచ్ లు ఆడింది. 5 మాత్రమే గెలుచుకుంది. టోర్నమెంట్ మొత్తం ఒక గెలుపు ఒక ఓటమి చందంగా పంజాబ్ ప్రయాణం సాగింది. కోల్ కతా చేతిలో భారీ ఓటమి తరువాత ప్రస్తుతం 11 పాయింట్లతో అయిదవ స్థానంలో కొనసాగుతోంది. ఇంకా 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. కనీసం మూడింటిలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. అప్పుడే ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతుంది.

6. లక్నో సూపర్ జైంట్స్.. భారీ అశలు పెట్టుకున్న రిషభ్ పంత్ ఈ టీమ్ ను లీడ్ చేయడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆడాల్సిన మరో 4 మ్యాచ్ లలో మూడింటిలో తప్పక మూడింటిలో విజయం సాధించాలి.

Also Read: చోరీ కారును ఓనర్‌కే విక్రయించిన దొంగలు.. కారు నెంబర్ మార్చినా ఎలా గుర్తు పట్టాడంటే?

7.కోల్ కతా నైట్ రైడర్స్.. ఈ జట్టు ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. తాజాగా ఢిల్లీ జట్టుని ఓడించడంతో పాయింట్ల పట్టికలో కాస్త తేరుకుంది. ఆడిన 10 మ్యాచ్ లలో 4 మాత్రమే గెలుచుకుంది. మరో నాలుగు మ్యచ్ లు మిగిలి ఉన్నాయి. కానీ ఆ నాలుగు గెలవాల్సిన పరిస్థితి. లేదా కనీసం మూడు గెలిస్తే.. రన్ రేట్ ఆధారంగా కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది.

8.రాజస్థాన్ రాయల్స్.. ఆడియన 10 మ్యాచ్ లలో మూడు మాత్రమే గెలుచుకుంది. మరో నాలుగు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. అవి అన్నీ గెలిస్తే 14 పాయింట్లు, రన్ ఆధారంగా కాస్త ప్లే ఆఫ్ చాన్సు లున్నాయి. ముందు జరిగిన కీలక మ్యాచ్ లలో ఓటమి పాలవడంతోనే రాజస్థాన్ కు ఈ గతి పట్టింది.

9.సన్ రైజర్స్ హైదరాబాద్.. సీజన్ ప్రారంభంలో ఫేవరెట్ టీంగా బరిలోకి దిగిన హైదరాబద్ టీమ్‌కు .. ఆ తరువాత అమాంతం క్రేజ్ పడిపోయింది. అయిదు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఇప్పుడే దాదాపు డిసైడ్ అయిపోయింది. ఇక ప్రతి మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి. అలా చేసినా ప్లే ఆఫ్ ఆశలు కనీసంగానే ఉంటాయి.

10. చెన్నై సూపర్ కింగ్స్.. ధోనీ లాంటి కూల్ కెప్టెన్ సారథ్యంలో ఉన్న ఈ టీమ్ కు ఇక ప్లే ఆఫ్ ఆశలు లేనట్లే. ఆడిన 9 మ్యాచ్ లలో రెండు మాత్రమే గెలిచింది. ఇక మిగిలిన 5 మ్యాచ్ లు అన్నీ గెలిచినా 14 పాయింట్లు లభిస్తాయి. కానీ రన్ రేట్ కూడా అద్వానంగా ఉంది. అందుకే ఇక నో ఛాన్స్.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×