Illu Illalu Pillalu Today Episode April 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి ఒక్కటే ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. అందరు ఎవరు చేశారో అని అనుకుంటారు. అప్పుడే కాఫీ తీసుకొని శ్రీవల్లి అక్కడికి వస్తుంది. ఈ పనులు అన్ని నువ్వు చేశావా? అని అడుగుతారు.. ఆయ్ ఆ పనులు అన్ని నేనే చేశాను అని అంటుంది.. నువ్వా అని షాక్ అవుతారు. నాకు ఇంట్లో నాలుగు గంటలకు లేసి పనులన్నీ చేయడం అలవాటు అలానే ఇక్కడ కూడా చేశాను మా అమ్మ చెప్పినట్లే చేశాను అని అందరి దగ్గర మొదటి రోజే మార్కులు కొట్టేస్తుంది. శ్రీవల్లి చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ సరదాగా సంతోషంగా ఉంటారు. అందరిని తన తీరుతో బుట్టలో వేసుకుంటుంది శ్రీవల్లి.. భాగ్యం కూతురు కోసం వస్తుంది. వచ్చి రాగానే ఇంట్లో కూతురికి గది కోసం పోరాడుతుంది. చిచ్చు పెట్టేసింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అదేంటి కొత్తగా పెళ్లయిన జంట కదా మీకు అచ్చట ముచ్చట ఉంటుంది. రేపు అన్ని సాంప్రదాయ ప్రకారం జరిపించాలి మరి గది లేకపోతే ఎక్కడ పెడతారు. అన్నయ్యగారు అని భాగ్యం ఇంట్లో చిచ్చు పెడుతుంది. మీకు ముందే చెప్పాను కదా చెల్లెమ్మ ఇంట్లో ఇంకొక గది కట్టించాలని ఇప్పుడే మేస్త్రిని పిలిపిస్తాను ఇంకొక గది కట్టిస్తానని అంటాడు.. రామరాజు మీరందరూ కొత్తగా పెళ్లయినోళ్లు మాకు మా గదేమో అవసరం లేదు మీరు మా గదిలో ఉండొచ్చు అని అంటాడు. కానీ ధీరజ్ మాత్రం మీరు రైస్ మిల్లులో రోజంతా నిల్చనే ఉంటారు. అమ్మ రోజంతా ఇంట్లో పనులు చేస్తూనే ఉంటుంది మీరు మా గదిలో ఉండొచ్చు అని అనగానే రామరాజు ఏం మాట్లాడకుండా నిలుచుంటాడు. భాగ్యం చూసావా అమ్మడు వచ్చి రాగానే నీకు గదా చాలా చేశాను ఇక ఇంట్లో పెత్తనం కూడా నువ్వే మెల్లగా నీ చేతిలోకి తీసుకోవాలని అంటుంది.
ఇక ధీరజ్ నాన్న మీరు ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచారు ఇప్పుడు మీరు కింద పడుకొని కష్టపడుతుంటే మేము చూడలేము మా గదిని అన్నయ్య వాళ్లకి ఇచ్చేస్తామని ధీరజ్ అంటాడు. రామరాజు ఎంత చెప్తున్నా కూడా ధీరజ్ వినకుండా ప్రేమ మన సామాన్లు సర్దేసుకొని బయటికి తీసుకొద్దాం పదా అనేసి తీసుకెళ్తాడు. గదిలోకి వెళ్ళగానే ప్రేమ నేనేమైనా తప్పు చేశానా? నీకు కింద పడుకోవడం రాదని ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే చెప్పావు కానీ తప్పలేదు అని ధీరజ్ అడుగుతాడు.. నువ్వు చేసింది 100% రైట్.. ఈ ప్లేస్ లో నేనున్న కూడా అదే చేస్తాను మరి ఏం పర్లేదు అడ్జస్ట్ అవుదాం లేని అని ధీరజ్ తో అంటుంది.
చందు శ్రీవల్లికి వాళ్ళ గదిని ఇచ్చేస్తారు.. తమ్ముడు చేసిన పనికి చందు సాగర్ ఇద్దరూ ధీరజ్ని మెచ్చుకుంటారు. చందు లోపలికి వెళ్ళగానే తన తమ్ముడు బయటకు వెళ్లాడని బాధగా ఉంటాడు. వల్లి తన బ్యాగులు తీసుకుని లోపల సద్దుతూ ఉంటుంది. మనకి చాలా బాగుంటుంది కదా బావ అంటుంది. అవును అనగానే శ్రీవల్లి మీ తమ్ముడు మరదలు బయటికి వెళ్లారు కదా అదే నాకు కొంచెం బాధగా ఉంది అని అంటుంది. వల్లి మీ అమ్మ వచ్చింది కదా డబ్బులు గురించి ఒకసారి అడగొచ్చు కదా అనేసి అంటాడు. ఏ డబ్బులు గురించి బావ అనేసి శ్రీవల్లి అడుగుతుంది..
నేను పది రోజులు ఇంట్రెస్ట్ కోసమే పది లక్షల తీసుకొచ్చాను మీ అమ్మని ఆ విషయం గురించి అడిగి కనుక్కో 10 రోజుల తర్వాత డబ్బులు వస్తాయని చెప్పావు కదా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని అడుగుతాడు. అది వినగానే షాక్ అయిన శ్రీవల్లి వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తుంది.. తిరుపతి తో ఇంటి గురించి అడుగుతూ ఉంటుంది భాగ్యం. ఇప్పుడే శ్రీవల్లి వచ్చి భాగ్యాన్ని పిలుస్తుంది. అమ్మ మీ అల్లుడుగారు 10 లక్షలు డబ్బులు గురించి అడిగారమ్మా మనం అడిగింది 10 రోజులే కదా ఇప్పుడేం చెయ్యాలి అని వల్లి టెన్షన్ పడుతుంది.
అదేంటే అప్పుడే అడుగుతున్నారు..? ఇంకో పది రోజులు అడుగుల మేనేజ్ చేయవే అని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది. ఏమోనమ్మా నాకు కాపురం మీద ఎఫెక్ట్ పడేలా ఉంది. మన నాటకం బయటపడుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. భాగ్యం మాత్రం నువ్వేం టెన్షన్ పడకు అన్నిటికీ నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తుంది.
ఇక ప్రేమ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ధీరజ్ గాడేంటే కాలేజీకి రాలేదు. ఒక వారంలో ఎగ్జామ్స్ కూడా వస్తాయి ఇప్పుడు రాకున్నా అంటే వాడు ఫెయిల్ అయిపోవడం ఖాయం అని వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రేమ మాత్రం వాళ్ళ అన్నయ్య పెళ్లి పనుల్లో వాడే చూసుకున్నాడు.. అందుకే బిజీగా ఉన్నాడని అంటుంది.. అప్పుడే వాటర్ క్యాన్లు మోస్తూ ప్రేమ కనిపిస్తాడు. ధీరజ్ చూసి ప్రేమ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు. వాడు ఏం చేస్తే మీకెందుకు వాడు ఎలా పోతే మీకెందుకు? మీరు కాలేజీకి వచ్చేది వాన్ని చూడడానికా? వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికా? అని ప్రేమ తిడుతుంది.
ధీరజ్ దగ్గరికి ప్రేమ వెళుతుంది.. ఏంటి కాలేజ్ అయిపోయిందా ఇలా వచ్చావ్ ఇంటికి వెళ్లకుండా అని ధీరజ్ అడుగుతాడు. నేను నీతోపాటి వస్తాను అని ప్రేమ అంటుంది.. ఎలా వస్తావంటే ఆటలో వస్తాను నీతో పాటే అని ప్రేమ అనగానే ఆటలు తీసుకొని వెళ్తాడు. తిన్నావా నీ ప్రేమ అడుగుతుంది. లేదు ఇంటికి వెళ్లి తినాలి అనగానే నేను బాక్స్ తీసుకెళ్ళాను కదా ఆ బాక్స్ అలాగే ఉంది ఇద్దరం కలిసి తిందాం పదాన్ని ఇద్దరు కలిసి కూర్చుని ప్రేమగా అన్నం తింటారు.. ధీరజ్ కాలేజీకి రాకపోతే ఏం జరుగుతుందో అని ప్రేమ చెప్తుంది. ఏమో మాటని విని నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తానని ధీరజ్ అంటాడు. ఈ సీన్ చూస్తుంటే వీరిద్దరి మధ్య గొడవలు తగ్గిపోయాయని తెలుస్తుంది. వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి పెద్దోడి శోభనానికి ముహూర్తం పెట్టించానండి. అలాగే నర్మదా వాళ్ళకి కూడా ఈరోజే శోభనం జరిపిద్దామని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో శ్రీవల్లి నర్మద శోభనానికి అడ్డుపడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..