Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ (Mumbai Indians ) కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) అడ్డంగా దొరికిపోయాడు. తన ప్రియురాలితో శ్రీలంక ట్రిప్ వేశాడు హార్థిక్ పాండ్యా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన భార్య నటాషా కు అధికారికంగా విడాకులు ఇచ్చిన తర్వాత… ప్రేమలో పడ్డాడు హార్థిక్ పాండ్యా. మొదట్లో… అనన్య పాండేతో ప్రేమాయణం నడిపారని హార్దిక్ పాండ్యా పై అనేక రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత మరో బాలీవుడ్ హీరోయిన్ అన్నారు. ఇక ఇప్పుడు మరో బ్యూటీని హార్దిక్ పాండ్యా… పడేసినట్లు చెబుతున్నారు.
Also Read: Rohit Sharma: మాల్దీవుల్లో రోహిత్ సైక్లింగ్.. వీడియో వైరల్
మొన్న దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ సమయంలో కూడా… ప్రతి మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా ప్రియురాలు హాజరైనట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. జాస్మిన్ వాలియా అనే సింగర్ ను ప్రేమిస్తున్నాడట హార్దిక్ పాండ్యా. అంతేకాదు ఆమెను దుబాయ్ కి తీసుకువచ్చింది హార్దిక్ పాండ్యా… అంటూ మొన్నటి వరకు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పూర్తికాగానే… ప్లేయర్ లందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఆడేందుకు ఇండియాకు వచ్చారు.
కానీ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం… యూటర్న్ కొట్టాడు. తన ప్రియురాలు జాస్మిన్ వాలియా అనే సింగర్ తో శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ షూట్లో భాగంగా ఈ ఇద్దరు కలిసి శ్రీలంకకు వెళ్లారట. అక్కడ ఓ కారులో నుంచి… దిగిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఇద్దరు ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే హార్దిక్ పాండ్యా అలాగే జాస్మిన్ వాలియా అనే సింగర్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా చెబుతున్నారు. అయితే ఈ వీడియో 2024 సంవత్సరంలో జరిగిందని మరికొంతమంది చెబుతున్నారు. ఆ సమయంలో టీమిండియా… శ్రీలంకలో పర్యటించినప్పుడు… హార్దిక్ పాండ్యా అలాగే జాస్మిన్ వాలియా ఎంజాయ్ చేసినట్లు చెబుతున్నారు.
Also Read: Most Sixes IPL: ఎక్కువ సిక్సులు కొట్టిన వీరులు…గేల్ ను టచ్ కూడా చేయలేరు ?
ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ… వీడియోలు వైరల్ కావడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు కామెంట్స్ మాత్రం పెడుతున్నారు. ఇది.. ఇలా ఉండగా… నటషా అలాగే హార్దిక్ పాండ్యా… ఇద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఆరు నెలల కిందటే ఈ జంట విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా అలాగే నటాషా దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. కుమారుడు కొన్ని రోజులపాటు నటషా దగ్గర… మరికొన్ని రోజులపాటు… హార్దిక్ పాండ్యా దగ్గర ఉండాలని కోర్టు చెప్పినట్లు సమాచారం.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">