Digvesh Singh Rathi: ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం రోజు ఐపీఎల్ లో లక్నోతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అనుచితంగా ప్రవర్తించిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ సింగ్ రతీకి బీసీసీఐ భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25% కోత విధించడంతోపాటు అతని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ ని కూడా జోడించింది.
పంజాబ్ ఓపెనర్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య ని అవుట్ చేసిన తర్వాత.. అతడి వద్దకు వెళ్లిన దిగ్వేష్ లెటర్ రైటింగ్ సంకేతం చేస్తూ బ్యాటర్ ని అవమానించాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంగించినందుకు గాను దిగ్వేష్ సింగ్ కి జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అయితే ఇలా జరిమానా విధించినప్పటికీ కూడా దిగ్వేశ్ తీరు మారలేదు. మళ్లీ ప్రత్యర్థితో అదే ప్రవర్తన తీరు ప్రవర్తించి మరోసారి విమర్శలకు గురయ్యాడు.
తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో కూడా అతడు మరోసారి అనుచితంగా ప్రవర్తించి, కాంట్రవర్సీ నోట్ బుక్ సెలబ్రేషన్ చేసుకొని హాట్ టాపిక్ గా మారాడు. లక్నో – ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో.. లక్నో గెలుపులో స్పిన్నర్ దిగ్వేష్ కీలకంగా వ్యవహరించాడు. అయితే దిగ్వేష్ రెండవ ఇన్నింగ్స్ తొమ్మిదవ ఓవర్ లోనే నోట్బుక్ సంబరాలు చేసుకున్నాడు. మొదటగా చేదనలో వికెట్లు పడి ముంబై ఒత్తిడిలోకి వెళ్లిపోయిన సందర్భంలో నమన్ ధీర్ చెలరేగి ఆడాడు.
ఈ క్రమంలో దూకుడు మీద ఆడుతున్న నమన్ ని దిగ్వేష్ అవుట్ చేసి గట్టిగా దెబ్బ కొట్టాడు. దిగ్వేష్ వేసిన ఓవర్ లోని మొదటి బంతిని లెగ్ సైడ్ కి ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు నమన్ ధీర్. కానీ అది బోల్తా కొట్టడంతో అవుట్ అయ్యాడు. దీంతో దీర్ వైపు చూస్తూ దిగ్వేశ్ తన నోట్బుక్ సెలబ్రేషన్స్ చేశాడు. ఈ క్రమంలో ప్రస్తుతం దిగ్వేష్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రెండవసారి కూడా అనుచితంగా ప్రవర్తించిన దిగ్వేశ్ కి ఎలాంటి శిక్ష విధిస్తారో వేచి చూడాలి.
అయితే ఇదే మ్యాచ్లో కెప్టెన్ రిషబ్ పంత్ కి కూడా జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి 12 లక్షల ఫైన్ వేశారు. ముంబై తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. బౌలింగ్ జట్టు 90 నిమిషాలలో నిర్ణీత 20 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉండగా.. 19 ఓవర్లు ముగిసే వరకు ఆ సమయం ముగిసిపోయింది. దీంతో లక్నో జట్టు చివరి ఓవర్ లో 30 గజాల సర్కిల్ బయట ఒక ఫీల్డర్ ని కోల్పోవలసి వచ్చింది. లక్నో జట్టు ఐపిఎల్ ప్రవర్తన నియమావళి 2.22 ఉల్లంఘించినట్లు బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం కెప్టెన్ రిషబ్ పంత్ కి 12 లక్షల జరిమానా విధించినట్లు తెలిపింది.
Knocks over Naman Dhir, brings out his ✍ celebration! 🔥
Box-office stuff from Digvesh Rathi 👌
#IPLonJioStar 👉 #LSGvMI, LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/jkCtfCG98a— Star Sports (@StarSportsIndia) April 4, 2025