BigTV English

IPL 2025 Auction: ఐపీఎల్-2025 మెగావేలంలో తెలుగు ఆటగాళ్ల హవా !

IPL 2025 Auction: ఐపీఎల్-2025 మెగావేలంలో తెలుగు ఆటగాళ్ల హవా !

IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు ( IPL 2025 Auction) సంబంధించిన మెగా వేలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మెగా వేలంలో… చాలామంది ప్లేయర్లు కోట్లల్లో సంపాదించుకున్నారు. ముఖ్యంగా మన టీమిండియా, భారత దేశానికి చెందిన ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. ఎక్కడ తగ్గకుండా.. వారిపై కోట్ల వర్షం కురిపించాయి 10 ఫ్రాంచైజీలు. ఈ తరుణంలోనే టీమిండియా వికెట్ కీపర్, డేంజర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు భారీ రేటు వచ్చింది.


 

టీమిండియా వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ కు ఏకంగా 27 కోట్లు రావడం జరిగింది. గత ఐపిఎల్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఉన్న పంత్ ను… ఈసారి లక్నో గెల్చుకుంది. అతని ఏకంగా… 27 కోట్లకు కొనుగోలు చేయడం… మనం చూసాం. గత 17 ఐపీఎల్ సీజన్లలో ఏ ప్లేయర్కు దక్కని రేటు పంతుకు మాత్రమే దక్కింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు. ఇక రిషబ్ పంత్ తర్వాత శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు సంపాదించుకున్నాడు.


శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ ను కొనుగోలు చేసింది కేకేఆర్ జట్టు. రిటన్షన్ లో అతని తీసుకోకపోయినప్పటికీ వేలం లోకి వచ్చాక వెంకటేష్ అయ్యర్ ను కొనుగోలు చేసింది కేకేఆర్ జట్టు. అయితే ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ మెగా వేలంలో తెలుగు ఆటగాళ్ల హవా కూడా కొనసాగింది. విశాఖపట్నం కు చెందిన అవినాష్ ను 30 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.

వేలంలోకి రాగానే పంజాబ్ కింగ్స్ అతనిపై.. ఆసక్తి చూపించి 30 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. అనంతరం కాకినాడకు చెందిన వెంకట సత్యనారాయణ రాజును 30 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ జట్టు. వెంకట సత్యనారాయణ రాజు కూడా ఈ మధ్యకాలంలో మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతను వేలంలోకి రాగానే 30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక అటు షేక్ రషీద్.. ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయడం జరిగింది.

గుంటూరు కు చెందిన 30 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK). దీంతో ఈసారి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ ముగ్గురు ప్లేయర్లు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ఆడబోతున్నారు. ఇక వీరితోపాటు… కొంతమంది యంగ్ ప్లేయర్లు కూడా సెలెక్ట్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ కొడుకు… అర్జున్ టెండూల్కర్ ను మరోసారి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. మొదట అతను అన్ సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోగా… చివరికి మళ్లీ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయాల్సి వచ్చింది.

ఇక టీమిండియా కు చెందిన అలాగే విదేశీ ప్లేయర్ల లో చాలామంది అన్ సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయారు. ఈ లిస్టులో పృద్విషా, అజిక్య రహానే, డేవిడ్ వార్నర్, లాంటి ప్లేయర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ.. గత సీజన్లో దారుణంగా విఫలం కావడంతో వారిని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు.

Also Read: IPL 2025 All Teams Squad: వేలం తర్వాత 10 జట్ల ప్లేయర్స్ లిస్ట్ !

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×