E-Paper
Advertisement

టాటా అదిరిపోయే స్కెచ్.. పెట్రోల్ రేట్లకు ఇక కాలం చెల్లినట్లే.. సామాన్యుడికి పండగే!

టాటా అదిరిపోయే స్కెచ్.. పెట్రోల్ రేట్లకు ఇక కాలం చెల్లినట్లే.. సామాన్యుడికి పండగే!
Advertisement

TATA Flex Fuel CARS : టాటా మోటార్స్ రూట్ మార్చబోతుంది.యస్ . ఇండియన్ ఆటోమొబైల్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఒక భారీ విప్లవానికి తెరలేపుతోంది. ఇప్పటివరకు రోడ్లపై పెట్రోల్, డీజిల్, ఈవీ కార్ల హవా చూశాం. కానీ, త్వరలోనే ఒకే కారులో డిఫరెంట్ ఫ్యూయల్స్ వాడేలా సరికొత్త టెక్నాలజీతో తో కొత్త వెహికల్స్ ని లాంచ్ చేయబోతుంది.ఒకరకంగా టాటా మోటార్స్ తీసుకొస్తున్న ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కూడా ఆటోమొబైల్ మార్కెట్లో అలాంటి సునామీనే సృష్టించబోతోందని చెప్పక తప్పదు.ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన వాహనాలను టాటా సంస్థ 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి గ్రాండ్‌గా లాంచ్ కానుందట.వీటిని కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఉండేలా ఈ కార్లను డిజైన్ చేస్తుండటం విశేషం.

ప్రభుత్వ విజన్‌ను ముందే పసిగట్టిన టాటా మోటార్స్

Advertisement

నిజానికి భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం, ఇంధన దిగుమతులను తగ్గించుకోవడం కోసం బయోఫ్యూయల్స్ వాడకాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే మార్కెట్లో E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) ఇంధనం అందుబాటులో ఉండగా, భవిష్యత్తులో దీనిని E85 మరియు చివరికి 100 శాతం ఇథనాల్‌తో నడిచే E100 స్థాయికి తీసుకెళ్లడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రభుత్వ విజన్‌ను ముందే పసిగట్టిన టాటా మోటార్స్, ట్రెండ్‌కు తగ్గట్టుగా 2023 నుంచే తమ అన్ని వాహనాలను E20 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ మాత్రమే కాదు.. ఎలక్ట్రిక్ (EV), సీఎన్‌జీ (CNG), హైడ్రోజన్ వంటి మల్టిపుల్ పర్యావరణహిత ఆప్షన్లపై టాటా ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.

also read :మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్.. ‘దళపతి విజయ్’ టాపిక్ పై సంచలన పోస్ట్!

Advertisement

‘టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్’

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా ప్రదర్శించిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు అందరి మైండ్ బ్లాక్ చేశాయి. ముఖ్యంగా ‘టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్’ కారు ఈ ఎక్స్ పోలోనే బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మోడల్‌లో రెగ్యులర్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే ఉపయోగించినప్పటికీ, లోపల జరిగే మెకానిజం మొత్తం మార్చేశారు. ఇథనాల్ మిశ్రమాలను తట్టుకునేలా దీని ECU (ఇంజిన్ కంట్రోల్ యూనిట్), ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎగ్జాస్ట్ వ్యవస్థల్లో టాటా ఇంజనీర్లు భారీ మార్పులు చేశారు. అటు నార్మల్ పెట్రోల్‌తోనూ, ఇటు హై పర్సంటేజ్ ఇథనాల్‌తోనూ ఈక్వల్‌గా, ఎక్కడా పవర్ తగ్గకుండా పర్ఫెక్ట్ మైలేజ్ ఇస్తుంది.

టెన్షన్ పూర్తిగా తప్పిపోవడం ఖాయం

అసలు ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ అంటే ఏంటనే కదా మీ డౌట్? ఇదొక స్మార్ట్ టెక్నాలజీ. పెట్రోల్, ఇథనాల్ లేదా ఈ రెండింటి మిశ్రమంలో దేనితోనైనా ఈ వాహనం నడుస్తుంది. మన దేశంలో పుష్కలంగా పండే చెరకు, మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యం వంటి పంటల వ్యర్థాల నుంచి ఈ ఇథనాల్ (బయోఫ్యూయల్)ను తయారు చేస్తారు. అంటే ఇది ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా అన్నమాట! సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇది అత్యంత తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కార్లు రోడ్లపైకి వస్తే పెట్రోల్ రేట్ల గురించిన టెన్షన్ పూర్తిగా తప్పిపోవడం ఖాయం. ఒకవైపు పర్యావరణానికి మేలు, మరోవైపు కస్టమర్ల బడ్జెట్‌కు ఊరటనిచ్చే ఈ టాటా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల కోసం ఆటోమొబైల్ లవర్స్ ఇప్పట్నుంచే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

also read :సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. రంగంలోకి కమల్ హాసన్, నడిగర్ సంఘం.. కోలీవుడ్‌లో పండగే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×