BigTV English

Heads of State Review : ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ హాలీవుడ్ మూవీ రివ్యూ… ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ కు ఫీస్ట్

Heads of State Review : ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ హాలీవుడ్ మూవీ రివ్యూ… ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ కు ఫీస్ట్

రివ్యూ : హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీ


నటీనటులు : జాన్ సెనా, ఇడ్రిస్ ఎల్బా, ప్రియాంక చోప్రా జోనస్, జాక్ క్వైడ్, ప్యాడీ కాన్సిడైన్, కార్లా గుగినో, స్టీఫెన్ రూట్ తదితరులు
ఓటీటీ : Amazon Prime Video
దర్శకుడు: ఇలియా నైషుల్లర్

Heads of State Movie Review in Telugu : బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు చెక్కేసిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. అయితే ఇప్పటిదాకా ఆమె పలు హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని అన్పించుకున్నప్పటికీ… చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లు మాత్రం లేవు. ఈ నేపథ్యంలోనే ఆమె ఫ్యాన్స్ ‘SSMB 29’తో ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవడం, ఈ దెబ్బతో హాలీవుడ్ లో ఉన్న హిట్ అనే లోటు తీరిపోవడం ఖాయమని అనుకుంటున్నారు. అయితే అంతకంటే ముందే ప్రియాంక చోప్రా నటించిన మరో హాలీవుడ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉంది ? అనేది రివ్యూలో తెలుసుకుందాం.


కథ
ఇదొక హై-ఆక్టేన్ యాక్షన్ కామెడీ మూవీ. యూఎస్ ప్రెసిడెంట్ విల్ డెర్రింగర్ (జాన్ సెనా), యూకే ప్రైమ్ మినిస్టర్ సామ్ క్లార్క్ (ఇడ్రిస్ ఎల్బా చుట్టూ కథ తిరుగుతుంది. ఈ ఇద్దరు నాయకులు ఒకరినొకరు అసహ్యించుకుంటారు. వీళ్ళ పబ్లిక్ రైవల్రీ రెండు దేశాల మధ్య “స్పెషల్ రిలేషన్‌షిప్”ను దెబ్బతీస్తుంది. ఒక డిప్లొమాటిక్ ఈవెంట్ కోసం లండన్‌లో కలిసిన ఈ ఇద్దరు నాయకులు NATO సమ్మిట్ కోసం విమానంలో యూరప్‌కు ప్రయాణిస్తారు. అయితే రష్యన్ ఆర్మ్స్ డీలర్ విక్టర్ గ్రాడోవ్ (ప్యాడీ కాన్సిడైన్) చేసిన టెర్రర్ దాడితో ఆ విమానం బెలారస్ అడవుల్లో కూలిపోతుంది. ఇప్పుడు విల్, సామ్ ఇద్దరూ MI6 ఏజెంట్ నోయెల్ బిస్సెట్ (ప్రియాంక చోప్రా జోనస్) సహాయంతో, శత్రువుల నుండి తప్పించుకోవడానికి… అలాగే గ్లోబల్ కుట్రను అడ్డుకోవడానికి తమ విబేధాలను పక్కనపెట్టి కలిసి పని చేయాల్సి వస్తుంది. నోయెల్ వీళ్లిద్దరినీ సేఫ్ గా వాళ్ళ దేశాలు చేర్చగలిగిందా? విల్, సామ్ మధ్య ఉన్న శతృత్వం ఏంటి? చివరకు ఏమైంది? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ
సినిమా స్పెయిన్‌లోని టొమాటినా ఫెస్టివల్‌లో ఒక యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలవుతుంది. బెలారస్, వార్సా, ట్రియెస్టేలలో జరిగే ఛేజ్ సీన్స్, గన్‌ఫైట్స్, ఫిస్ట్‌ఫైట్స్‌తో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. నోయెల్ బిస్సెట్, ఒక బాడాస్ ఏజెంట్‌గా ఈ ఇద్దరు నాయకులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, అయితే సామ్‌తో ఆమె గత రొమాంటిక్ కనెక్షన్ కథకు మరో లేయర్ ను జోడిస్తుంది. ఈ ముగ్గురూ కలిసి కామెడీ, యాక్షన్, ట్విస్ట్‌లతో ఈ గ్లోబల్ థ్రిల్ రైడ్‌ను ఎలా నడిపిస్తారనేది కథ కీలకాంశం. అయితే ప్రిడిక్టబుల్ స్క్రిప్ట్, లాజిక్ లోపాలు, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం సినిమాను సగటు స్థాయిలో నిలిపాయి. ఇలియా నైషుల్లర్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. టొమాటినా ఫెస్టివల్‌లో ఓపెనింగ్ సీక్వెన్స్, మరికొన్ని సీన్స్ 90ల నాటి యాక్షన్ సినిమాల నాస్టాల్జియాను గుర్తుచేస్తాయి. స్మార్ట్ వన్-లైనర్స్‌తో విల్, సామ్ కామెడీ కూడా బాగుంది.

ప్రియాంక MI6 ఏజెంట్ నోయెల్ బిస్సెట్ పాత్ర హాలీవుడ్‌లో ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ప్రియాంక రోల్ బాడాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు, స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెను గ్లోబల్ యాక్షన్ స్టార్‌గా నిలబెట్టాయి. ఇది ఆమె ఇండియన్ అభిమానులకు గర్వకారణం. అయితే ప్రియాంక, ఎల్బా మధ్య రొమాంటిక్ యాంగిల్ ఫోర్స్డ్‌గా, అనవసరంగా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ బ్యాక్‌స్టోరీలు లేకపోవడం వల్ల ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం కష్టమవుతుంది. ఇక హీరోలు జాన్ సెనా, ఇడ్రిస్ ఎల్బా లవ్-హేట్ వార్, అందులో వారి నటన సినిమాకు హైలైట్. కార్లా గుగినో, స్టీఫెన్ రూట్, ప్యాడీ కాన్సిడైన్ వంటి సపోర్టింగ్ నటులకు తగినంత స్కోప్ లభించలేదు. విలన్ పాత్ర (విక్టర్ గ్రాడోవ్) సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల ఇంపాక్ట్ మిస్సయింది.

ప్లస్ పాయింట్స్
స్టార్ పవర్
యాక్షన్ సీక్వెన్స్ లు
ప్రియాంక చోప్రా రోల్

మైనస్ పాయింట్స్
ఎమోషనల్ డెప్త్ లేకపోవడం
ప్రిడిక్టబుల్, లాజిక్-లెస్ స్క్రిప్ట్

మొత్తంగా
ప్రియాంక చోప్రా కోసం ఓసారి చూడొచ్చు.

Heads of State Movie Rating : 2/5

Related News

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Kingdom Review: కింగ్డమ్ ఫస్ట్ రివ్యూ.. ఆశ్చర్యపరుస్తున్న ఉమైర్ సంధు ట్వీట్!

Mandala Murders series review : ‘మండల మర్డర్స్’ సిరీస్ రివ్యూ… కన్ఫ్యూజింగ్ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

Sarzameen Review : ‘సర్జమీన్’ మూవీ రివ్యూ… థ్రిల్ మిస్సైన థ్రిల్లర్

Big Stories

×