BigTV English

IPL Players: ఐపీఎల్ ప్లేయర్లకు కొత్త వ్యాధి వచ్చిందా… ఇలా బక్కగా అయిపోయారు ఏంటి?

IPL Players: ఐపీఎల్ ప్లేయర్లకు కొత్త వ్యాధి వచ్చిందా… ఇలా బక్కగా అయిపోయారు ఏంటి?

IPL Players: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {AI} హవా నడుస్తోంది. రోజు రోజుకి ఏఐ వినియోగం భారీగా పెరుగుతుంది. దాదాపు అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా రోజురోజుకీ కొత్త కొత్త ఇమేజ్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలు ఏఐ సాయంతో నెట్ లోకి వస్తున్నాయి. ఆర్ట్ వరల్డ్ లో ఏఐ చాలా మార్పులు తీసుకొస్తుంది. ప్రపంచ నాయకులను పిల్లలుగా మార్చడం నుండి క్రికెటర్లను వివిధ అవతారాలలో క్రియేట్ చేయడం వరకు ఏఐ జనరేటెడ్ ఆర్ట్ అబ్బురపరిస్తోంది.


Also Read: Jasprit Bumrah: బుమ్రా వెంట పడుతున్న లేడీ… హాట్ చూపులతో పడేసేలా ఉందే!

అయితే ఈ ఏఐతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన ఫోటోలు.. నిజమైన ఫోటోలను పోలినట్లు ఉండే నకిలీ ఫోటోలు.. కొన్ని సందర్భాలలో అటు సెలబ్రిటీలను, ఇటువారి అభిమానులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో ఏది అసలైన ఫోటో..? ఏది ఏఐ తో చేసిన ఫోటో అనే విషయాన్ని తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది.


ఆమధ్య ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా సమయంలో టీమిండియా క్రికెటర్ల ఫోటోలను సాధువుల రూపంలోకి మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొంతమంది నెటిజెన్లు. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, సంజూ శాంసన్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, రాహుల్, యశస్వి జైష్వాల్, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఫోటోలను సాధువుల రూపంలోకి మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

అయితే తాజాగా మరోసారి టీమిండియా క్రికెటర్లకు ఏదో వైరస్ సోకిన విధంగా.. వారిని సన్నగా మార్చి సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన ఆ క్రికెటర్ల అభిమానులు తీవ్ర స్థాయిలో అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ క్రికెటర్లను బక్కగా మార్చి ఓ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి స్టార్ క్రికెటర్ల పరువు ఎందుకు తీస్తున్నారు అంటూ వారి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Prasidh krishna: కప్పను మింగిన పాములాగా తయారైన ప్రసిద్… టీమిండియాను ఓడించేందుకు కుట్రలు..?

ఈ ఏఐ ని మంచికి ఉపయోగిస్తే పరవాలేదు కానీ.. ఇలాంటి వీడియోలను క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఏఐ నేటితరం యువతకు అనేక అంశాలలో నైపుణ్యాలు పెంచుకోవడానికి దోహదపడుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ అండ్ నెగిటివ్ చర్చలు కూడా జరిగాయి. ఈ ఏఐ వల్ల నష్టాలు తప్ప లాభాలు లేవని పలువురు సోషల్ మీడియాలో వాదించగా.. మార్పుని స్వాగతించాల్సిందేనని మరికొంతమంది చెబుతున్నారు. కానీ ఈ టెక్నాలజీ సెలబ్రిటీలకు మాత్రం శాపంగా మారిందని చెప్పవచ్చు.

?utm_source=ig_web_copy_link

Related News

హర్మన్‌ కు ఏది చేత‌కాదు, 330 టార్గెట్ ను కాపాడుకోలేక‌పోయారు..ఇంట్లో గిన్నెలు తోముకోండి?

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇక ర‌చ్చ ర‌చ్చే

Thaman: ముర‌ళీధ‌ర‌న్ ను మించిపోయిన త‌మ‌న్.. 24 ప‌రుగుల‌కే 4 వికెట్లతో తాండ‌వం

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Big Stories

×