BigTV English

Saif Ali Khan: సైఫ్ కి కోర్ట్ లో చుక్కెదురు.. రూ.15000 కోట్ల ఆస్తిపై హైకోర్టు కీలక నిర్ణయం!

Saif Ali Khan: సైఫ్ కి కోర్ట్ లో చుక్కెదురు.. రూ.15000 కోట్ల ఆస్తిపై హైకోర్టు కీలక నిర్ణయం!

Saif Ali Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) గత కొన్ని రోజులుగా ఆస్తులకు సంబంధించిన కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భోపాల్ లోని పూర్వీకుల ఆస్తులకు సంబంధించి సైఫ్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ ను తాజాగా మధ్య ప్రదేశ్ హైకోర్టు కొట్టి వేసింది. సైఫ్ అలీ ఖాన్ ఆయన సోదరీమణులు సోహ, సబా, తల్లి షర్మిల ఠాగూర్ తమ పూర్వీకుల ఆస్తులకు వారసులుగా గుర్తించాలి అని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టి వేసింది. ముఖ్యంగా తన ముత్తాత పాకిస్తాన్ కి వలస వెళ్లిన కారణంగానే ఈ రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులను “శత్రువుల ఆస్తి”గా న్యాయస్థానం గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో 15 వేల కోట్ల ఆస్తులపై హక్కులను కోల్పోయింది సైఫ్ అలీ ఖాన్ కుటుంబం. ఇక ఈ విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే.


వారసత్వ వివాదాన్ని సైఫ్ కి గుర్తుచేసిన కోర్టు..

ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ ఆస్తి వారసత్వ వివాదాన్ని కొత్తగా వివరించాలని.. ఒక సంవత్సరం టైం నిర్ణయించాలని ట్రయల్ కోర్టును గతంలో ఆదేశించింది. ముఖ్యంగా 1947లో విభజన తర్వాత పాకిస్తాన్ కి వలస వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం క్లైమ్ చేసుకోవడానికి 1968 నాటి శత్రు ఆస్తి చట్టం అనుమతిస్తుంది అని హైకోర్టు గుర్తుచేసింది. ఇక ఈ క్రమంలోనే ఈ ఆస్తిని శత్రువుల ఆస్తిగా పరిగణించింది.


రూ.15 వేల కోట్ల ఆస్తి ఎవరి సొంతం?

ఇకపోతే ఈ 15 వేలకోట్ల స్టోరీ ఏంటి? ఇది ఎవరి సొంతం అనే విషయానికి వస్తే.. బ్రిటిష్ అధికారులు భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ ప్రాంతాలలో పటౌడి సంస్థానాన్ని పరిపాలించిన హామీదుల్లాహ్ రాజ కుటుంబానికి చెందిన 15వేల కోట్ల విలువైన ఆస్తులు ఎవరి సొంతం కానున్నాయి అనే వార్తలు రాగా.. ఇప్పుడు ఈ ఆస్తి ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ (CEPI) చెందనున్నట్లు మోడీ ప్రభుత్వం వెల్లడించింది. ఏది ఏమైనా 15 వేల కోట్ల ఆస్తి ఇప్పుడు చేజార్చుకోవడం అంటే నిజానికి ఈ కుటుంబానికి ఇంతకంటే పెద్ద షాక్ మరొకటి ఉండదు అని చెప్పవచ్చు.

సైఫ్ అలీ ఖాన్ సినిమాలు..

ప్రముఖ నటుడిగా, నిర్మాతగా, సుప్రసిద్ధ క్రికెట్ ఆటగాడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. 1996లో తూ చోర్ మై సిపాహి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసిన ఈయన.. తెలుగులో 2022లో వచ్చిన ఆది పురుష్ సినిమాలో రావణాసురుడిగా నటించారు. అంతేకాదు గత ఏడాది ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమాలో విలన్ గా నటించారు.

ALSO READ:Regena Cassandra: పెళ్లిపై రెజీనా కామెంట్స్.. వారికి లేని బాధ మీకెందుకంటూ?

Related News

Telugu Film Workers : సమ్మె విరమణ, సీఎం రేవంత్ రెడ్డి పై తెలుగు సినిమా ప్రముఖులు ప్రశంసల జల్లు

Tollywood cineworkers: ముగిసిన సినీ కార్మికుల సమ్మె, కాసేపట్లో ప్రెస్ మీట్

Mega 157 Glimpse: మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు, టీజర్ అదిరింది. అసలైన మెగా ట్రీట్

TVK Maanadu: అడవికి రాజు ఒక్కడే, విజయ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ కి సెటైరా.?

Tollywood Films: స్ట్రైక్ ఎండ్ అయితే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉన్న సినిమాలివే

Anushka Shetty: అనుష్క మార్కెట్ రూ. 25 కోట్లలోపే… యంగ్ హీరోయిన్ బెటర్ కదా..

Big Stories

×