Prasidh krishna: టీమిండియా యువ పేసర్ ప్రసిద్ద్ కృష్ణ ఇంగ్లాండ్ పర్యటనలో దారుణంగా విఫలమవుతున్నాడు. రెండవ టెస్ట్ లోను ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ప్రసిద్ధి కృష్ణ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత చెత్త బౌలింగ్ చేస్తావా..? అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ నేపథ్యంలో ప్రసిద్ద్ కృష్ణ టెస్టుల్లో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు.
Also Read: Mohammed Siraj: ప్రభాస్ హీరోయిన్ తో రొమాన్స్.. తెలంగాణ డీఎస్పీ సిరాజ్ ఇంతకు తెగించాడ్రా!
148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ కి సాధ్యం కానీ ఓ అనవసర రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులు వేసిన బౌలర్లలో అత్యధిక ఎకానమీ రేట్ నమోదు చేసిన బౌలర్ గా నిలిచాడు ప్రసిద్ద్ కృష్ణ. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే చెత్త ఎకానమీ కావడం గమనార్హం. 588 బంతులు వేసిన ప్రసిద్ద్ కృష్ణ.. 518 పరుగులు ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే వరస్ట్ ఎకానమీ. రెండవ టెస్టులో అతడు వేసిన 32వ ఓవర్ లో 23 పరుగులు ఇవ్వడంతో ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు.
ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో వరస్ట్ బౌలింగ్ ఎకానమీ కలిగిన బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత భారత స్పిన్నర్ వరుణ్ అరుణ్ 4.77 అకాడమీతో రెండవ స్థానంలో ఉండగా.. జహీర్ ఖాన్ 4.66 తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక ప్రసిద్ కృష్ణ కి భారత సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ నుండి గట్టి సపోర్ట్ ఉంది. ఈ కర్ణాటక బౌలర్ 2023 డిసెంబర్ లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. అప్పటినుండి రెడ్ బాల్ ఫార్మాట్ లో భారత్ తరపున చెప్పుకోదగిన ప్రదర్శన కనబరచలేదు.
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తాడని సెలెక్టర్లు ఇతడిని ఎంపిక చేశారు. కానీ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 5 టెస్టులు ఆడిన అతడు.. వన్డే తరహాలో పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 13 ఓవర్లు వేసిన అతడు.. 72 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా తన టెస్టు కెరీర్ లో ఇప్పటివరకు 618 బంతులు వేసిన ఈ బౌలర్.. 529 పరుగులు సమర్పించుకున్నాడు.
ముఖ్యంగా రెండవ టెస్టులో జేమీ స్మిత్ ఓకే ఓవర్ లో 23 పరుగులు రాబట్టి ప్రసిద్ కి చెమటలు పట్టించాడు. ఈ క్రమంలో ప్రసిద్ తన బౌలింగ్ ని మెరుగుపరుచుకోకపోతే టెస్ట్ జట్టులో అతడి ప్లేస్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రెండవ టెస్టులో అతడు మంచి ఆరంభం ఇచ్చినట్లు కనిపించాడు. మొదటి 5 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Also Read: Chicken RS 1000 Per Kg: ధోని బిజినెస్ అదుర్స్.. కేజీ చికెన్ 1000 రూపాయలు.. దీని ప్రత్యేకత ఇదే
కానీ ప్రసిద్ ని జమీ స్మిత్ ఓ ఆట ఆడుకున్నాడు. 32వ ఓవర్ లో ప్రసిద్ బౌలింగ్ లో స్మిత్ ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. 2000 సంవత్సరం తర్వాత టీమిండియా బౌలర్లు వేసిన అత్యంత ఖరీదైన ఓవర్లలో ఇది నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, కర్ణ్ శర్మ తర్వాత ప్రసిద్ ఉన్నాడు. దీంతో ప్రసిద్ బౌలింగ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు క్రీడాభిమానులు. అతడు కప్పను మింగిన పాములా తయారయ్యాడని.. టీమ్ ఇండియాని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 4, 2025