BigTV English

Anushka Sharma: భార్య భర్తలను విడగొడతారా? BCCI రూల్స్ పై అనుష్క శర్మ ఫైర్ ?

Anushka Sharma: భార్య భర్తలను విడగొడతారా? BCCI రూల్స్ పై అనుష్క శర్మ ఫైర్ ?

Anushka Sharma:  భారత క్రికెట్ నియంత్రణ మండలి పై అనుష్క శర్మ చాలా సీరియస్ అయ్యారు. తాజాగా టీమిండియా పైన… అమలు చేస్తున్న రూల్స్ ను తప్పు పడుతూ పరోక్షంగా అనుష్క శర్మ స్పందించడం జరిగింది. భార్యాభర్తలను విడగొట్టేలా… భారత క్రికెట్ నియంత్రణ మండలి రూల్స్ ఉన్నాయని ఆమె చెప్పకనే చెప్పారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో టీమిండియా అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచింది. ఆ ట్రోఫీని కూడా దక్కించుకోలేకపోయింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే టీమిండియా ప్లేయర్లకు కొత్త రూల్స్ అమలు చేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.


 

Also Read: IPL 2025: నాలుగు రోజుల్లోనే ఐపీఎల్‌ 2025.. టైమింగ్స్‌, ఉచితంగా చూడాలంటే ఎలా ?


విదేశీ టూర్లకు… భార్యలను అలాగే కుటుంబ సభ్యులను అస్సలు తీసుకువెళ్లకూడదని కండిషన్లు పెట్టిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. అలాగే టీమ్ ఇండియా ప్లేయర్లు తినే ఆహారం విషయంలో కూడా ఆంక్షలు విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. తాము ఇస్తున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని పేర్కొందట. స్పెషల్ గా కుక్ ను తీసుకు రాకూడదని కూడా ఆంక్షలు విధించింది. అలాగే ప్రత్యేక వాహనాలలో గ్రౌండ్లకు వెళ్లడం కూడా ఉండకూడదని పేర్కొంది. అలా చేస్తే… కోత తప్పదని హెచ్చరించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

అయితే క్రికెట్ ప్లేయర్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అమలు చేస్తున్న రూల్స్ పై చాలామంది… సీరియస్ అవుతున్నారు. అందరికీ కుటుంబ సభ్యులు ఉంటారు… అలాంటప్పుడు భార్యలను తీసుకువెళ్లకూడదని రూల్స్ పెడతారా ? ఇవెక్కడి దిక్కుమాలిన రూల్స్ ? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు మాజీ క్రికెటర్లు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈ రూల్స్ పై పెదవి విరిచారు. అత్యంత దారుణంగా రూల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. అయితే నేరుగా భారత క్రికెట్ నియంత్రణ మండలిపై నేరుగా విమర్శించకుండా పరోక్షంగా స్పందిస్తున్నారు క్రికెటర్లు.

Also Read:  IPL 2025: జియో నుంచి అదిరిపోయే ప్లాన్‌.. ఇక ఫ్యాన్స్ కు జాతరే ?

అయితే ఈ ఫ్యామిలీ రూల్స్ పై రకరకాల… అభిప్రాయాలు వస్తుంద నేపథ్యంలో… టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ భారీ అనుష్క శర్మ కూడా స్పందించారు. పరోక్షంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి పెట్టిన రూల్స్ ను ఆమె వ్యతిరేకించారు. నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి అంటూ ఓ రేంజ్ లో స్పీచ్ ఇచ్చారు అనుష్క శర్మ. కానీ నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు అని ఆమె వ్యాఖ్యానించారు. అంటే ఈ వ్యాఖ్యలను చూస్తే… భారత క్రికెట్ నియంత్రణ మండలి రూల్స్ పైన సెటైర్లు పేల్చుతూ… అనుష్క శర్మ స్పందించినట్లు మనకు అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరిపోయాడు విరాట్ కోహ్లీ. మొదటి రోజున అంటే మార్చి 22వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా మధ్య మ్యాచ్ ఉంది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×