Is Hardik Pandya dating This girl Wife, Natasha Stankovic Responds to Controversy:
ఏ ముహూర్తాన ముంబయి కెప్టెన్సీ తీసుకున్నాడో తెలీదుగానీ అప్పటి నుంచి హార్దిక్ పాండ్యాకు ఇంటా బయట తలనొప్పలు మొదలయ్యాయి. ఒక ఆరునెలలు అతని జీవితంలో చీకటి రోజులు చూశాడు. అలాంటి సమయంలో అండగా ఉండాల్సిన భార్య నటాషా అతనితో కనిపించలేదు. అయితే రకరకాల వదంతులు వినిపించాయి.
ఎన్ని జరిగినా సరే, టీ 20 ప్రపంచకప్ ఫైనల్ లో ఆఖరి ఓవర్ వేసి, భారత్ కి ప్రతిష్టాత్మకమైన కప్ తీసుకువచ్చిన క్షణంలో హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతటి పరిస్థితుల్లో భార్య ఏం చేయాలి? తను మరింత బాధపడాలి? కానీ పాండ్యా భార్య ఎక్కడా కనిపించలేదు? కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేదు.
సరే, కప్ గెలిచిన పాండ్యా ఇంటికి వచ్చాడు. తను నివసించే అపార్ట్ మెంట్ అంతా కోలాహలంతో నిండిపోయింది. సంతోషంతో వచ్చిన కొడుకు మెడలో మెడల్ వేశాడు. అక్కడ కూడా భార్య నటాషా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అసలు తన ఫ్లాట్ లోనే లేదని అందరికీ అర్థమైంది.
అంతకుముందే తన పేరు చివర పాండ్యా ఇంటిపేరును నటాషా తొలిగించి, సామాజిక మాధ్యమాలకు ఒక హింట్ ఇచ్చింది. అయిపోయింది. ఇదే సీక్వెన్స్ లో హార్దిక్ పాండ్యా పుట్టిన రోజు వచ్చింది. దానికి ఆమె స్పందించలేదు. ఈ క్రమంలో ఆమె అనుసరించే విధానాలపై హార్దిక్ అభిమానులు సీరియస్ అయ్యారు.
దీంతో ఆమె తట్టుకోలేక ఒక బాంబ్ పేల్చింది. అందరూ తనని టార్గెట్ చేయడంతో సహించలేకపోయింది. వెంటనే ఎందుకు తను పక్కకి వెళ్లిపోయిందో వివరించింది. ఇంతకీ విషయం ఏమిటంటే హార్దిక్ పాండ్యా మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడని తెలిపింది. అందుకనే తను దూరంగా ఉంటున్నట్టు చెప్పకనే చెప్పింది.
Also Read: నేడే లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్
ఇదే సమయంలో తాజాగా హార్దిక్ పాండ్యా.. ఓ అమ్మాయితో చనువుగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె భుజాలపై చేయి వేసి మరి హార్దిక్ ఫొటో దిగాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి హార్దిక్ పాండ్యా కుటుంబ సభ్యులతో చనువుగా ఉన్న ఫొటోలను కూడా పంచుకుంది. దాంతో ఆ మిస్టరీ అమ్మాయి ఎవరా? అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.తను ఒక ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ప్రచి సోలంకి అని కొందరు తేల్చి చెబుతున్నారు.