Big Stories

Ishan Kishan vs Jitesh Sharma : ఇషాన్ కిషన్ అవుట్ .. జితేశ్ శర్మ ఇన్ ? తలబొప్పి కడుతున్న టీ 20 కూర్పు ..

Ishan Kishan vs Jitesh Sharma

Ishan Kishan vs Jitesh Sharma : సౌతాఫ్రికాలో ఆడనున్న టీమ్ ఇండియా టీ 20 మ్యాచ్ కి 11 మందిని ఫైనల్ చేయడం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కి కత్తి మీద సాముగా మారింది. ఒకరిని మించినవాళ్లు ఒకరు కనిపిస్తున్నారు. అందరూ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు.

శుభ్ మన్ గిల్ ఓపెనర్ గా వస్తే, రుతురాజ్ గైక్వాడ్ లేదా యశస్వి జైపాల్ లో ఒకరు బెంచ్ మీద ఉండాలి.
ఫస్ట్ డౌన్ శ్రేయాస్ అయ్యర్ ఉండనే ఉన్నాడు. సెకండ్ డౌన్ కెప్టెన్ సూర్య కుమార్ ఉన్నాడు. వీరిద్దరినీ తప్పించలేం.
ఇప్పుడు ఐదో స్థానంలో వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్ లేదంటే జితేశ్ శర్మ అయినా ఉండాలి.

- Advertisement -

ఆరో స్థానంలో రింకూ సింగ్ ఉండనే ఉన్నాడు. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇది సీక్వెన్స్.. ఇక స్పెషలిస్ట్ బౌలర్లుగా రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫేస్ త్రయాన్ని మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ తోడుగా ఉంటారు. యశస్విజైపాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ వీరిలో ఇద్దరు ఉండాలి. ఇద్దరు బెంచ్ మీద ఉండాలి. అది ఎవరన్నది ఇంకా తేల్చలేదు.

- Advertisement -

ఆసిస్ తో జరిగిన టీ 20 సిరీస్ లో ఇషాన్ కిషన్ రెండు ఆఫ్ సెంచరీలు చేసి, జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. తర్వాత మూడో మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడు. అంతే చివరి రెండు మ్యాచ్ లకి పక్కన పెట్టేశారు. అప్పుడు స్టాండ్ బైగా ఉన్న జితేశ్ ని తీసుకొచ్చారు.

తను చివర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోయే మ్యాచ్ లను గెలుపు బాట పట్టించాడు. తను చేసినవి తక్కువ పరుగులే అయినా, చివరికి అవే విలువైనవిగా మారి టీమ్ ఇండియా విజయం సాధించింది.

రుతురాజ్ గైక్వాడ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఉన్నాడు. జైస్వాల్ ఓపెనింగ్ అద్భుతంగా ఉంది. 5 ఓవర్ల వరకు వికెట్ కాపాడుకుంటూ మిడిల్ ఆర్డర్ పై  ఒత్తిడి పడకుండా చూస్తున్నాడు.

ఇదండీ సంగతి…మరి మీరే రాహుల్ ద్రవిడ్ ప్లేస్ లో ఉంటే, ఎవరిని తీసుకుంటారు? ఎవరిని పక్కన పెడతారు? ఎందుకలా చేస్తారు? ఒకసారి సరదాగా ఆలోచన చేయండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News