Paarl Royals: టి-20 క్రికెట్ లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కనీ వినీ ఎరుగని ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ జట్టు ఏకంగా 20 ఓవర్లను స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ లో శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్ {Pretoria Capitals} – పార్ల్ రాయల్స్ {Paarl Royals} మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.
AlsoRead: ICC Under 19 Womens T20 World Cup: టీమిండియా మరో విజయం.. వరుసగా మూడోది
అయితే ఈ మ్యాచ్ లో పార్ల్ రాయల్స్ {Paarl Royals} జట్టు ఏకంగా 20 ఓవర్లను స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. దీంతో ఫ్రాంచైజీ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా పార్ల్ రాయల్స్ రికార్డ్ సృష్టించింది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. {Paarl Royals} పూర్తిగా స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించినప్పటికీ పార్ల్ రాయల్స్ జట్టు ఈ మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో పార్ల్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేపట్టగా.. బ్యాటర్లు జో రూట్ 56 బంతులలో 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ 18 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక ప్రిటోరియా {Pretoria Capitals} బౌలర్లలో విల్ జాక్స్, సిమ్మండ్స్, బోస్చ్, ముతుసామి తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ కి దిగిన ప్రిటోరియా క్యాపిటల్ {Pretoria Capitals} నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది. ప్రిటోరియ బ్యాటర్లలో విల్ జాక్స్ 53 బంతులలో 56 పరుగులు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కైల్ వెరీనే 33 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంతో పార్ల్ రాయల్స్ {Paarl Royals} జట్టు 11 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ కి దూసుకెళ్లింది. పార్ల్ రాయల్స్ జట్టుకు భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ప్రతినిత్యం వహిస్తున్నాడు.
AlsoRead: Virat Kohli: ఫామ్ లేక కోహ్లీ విల విల.. రంగంలోకి ముగ్గురు సీఎంలు ?
ఈ సీజన్ లో పార్ల్ రాయల్స్ {Paarl Royals} ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడి.. ఆరు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో పార్ల్ రాయల్స్ {Paarl Royals} బౌలింగ్ లో.. జో రూట్, పీటర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫర్చూన్, దునిత్ వెల్లలెగ లు 20 ఓవర్లు బౌలింగ్ చేశారు. వీరిలో ఫర్చున్, జో రూట్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.. తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక దునీత్ ఓ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో జో రూట్ బ్యాట్ తోనే కాకుండా బంతితోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
PAARL ROYALS BOWLED 20 OVERS OF SPIN IN A T20 MATCH 🤯
– History in SA20….!!!! pic.twitter.com/1E70HG1qMZ
— Johns. (@CricCrazyJohns) January 25, 2025