Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న.. పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని.. 16 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు.
మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముగ్గురు మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షాట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేక ఎవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మోతీనగర్ లోని ఓ ఫంక్షన్ హాలులో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా.. భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
Also Read: ఒక హనీమున్, ఒక సీక్రెట్ లవర్, ఒక ప్లాన్డ్ మర్డర్.. అసలు కథ ఇది!
వెంటనే సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.
#WATCH | Delhi | Morning visuals from a factory near Rithala metro station, where a fire broke out yesterday. Fire tenders present at the spot. pic.twitter.com/WNajeJ6FT4
— ANI (@ANI) June 25, 2025