Vaibhav Suryavanshi: బీహార్ కి చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలో ఎంతగా గుర్తింపు పొందాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ 2025 సీజన్ నుండి అంతా వైభవ్ సూర్యవంశి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత చిన్న వయసులో ఐపీఎల్ లాంటి పెద్ద ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశించడం ఒక కలను నిజం చేసుకోవడమే.
Also Read: Harsh Goenka: టెస్టుల్లో పులి… ఐపీఎల్ లో కుక్క లాంటోడు.. గొయెంకా వివాదాస్పద పోస్ట్
ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోసి, ఐపీఎల్ చరిత్రలో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. తన మూడవ ఐపీఎల్ మ్యాచ్ లో వైభవ్ {Vaibhav Suryavanshi} ఈ ఘనత సాధించడం గమనార్హం. అంతేకాకుండా కేవలం 35 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు వైభవ్. అతడి ఆత్మవిశ్వాసం, అద్భుతమైన బ్యాటింగ్, మైదానంలో ఫియర్ లెస్ ఆటిట్యూడ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. అలా చిన్న వయసులోనే తన కృషి, పట్టుదలతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
అలాగే భారత్ తరఫున ఆడాలనేది వైభవ్ సూర్యవంశీ కళ. ఇందుకోసం అతడు రాత్రి, పగలు కష్టపడి పని చేస్తున్నాడు. అతడికి చిన్నప్పటినుండి క్రీడలు అంటే ఎంతో ఆసక్తి. దీంతో చిన్న వయసు నుండే బ్యాటింగ్ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎంతోమందికి ప్రేరణగా మారాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 10వ తరగతి. పట్నాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో, అనేక నివేదికలలో మాత్రం వైభవ్ సూర్యవంశీ తన చదువును వదిలేశాడని వాదిస్తున్నారు.
కానీ వాస్తవానికి వైభవ్ సూర్యవంశి తన చదువుతోపాటు క్రికెట్ ని కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాడు. అతడి కుటుంబం కూడా చదువు, క్రీడల మధ్య సమతుల్యతను కాపాడుతూ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా వైభవ్ సూర్యవంశికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ద్వారా అతడికి చిన్న పిల్లలు అంటే ఎంత ఇష్టమో అర్థం అవుతుంది.
Also Read: Watch Video: బుర్కా లేడి భయంకర బ్యాటింగ్.. సర్పంచ్ సాబ్ కంటే దారుణంగా ఆడుతుందిగా
ఓ రెండూ వారాల క్రితం వైభవ్ సూర్య వంశీ మాస్క్ ధరించి రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ ఇద్దరు నిరుపేద చిన్నారులు రోడ్డు పక్కన కూర్చున్నారు. వారిని చూసిన వైభవ్ సూర్యవంశీ మనసు చెలించింది. వారిని ఆప్యాయంగా దగ్గరకు పిలుచుకుని తన వద్ద ఉన్న డబ్బుని వారికి అందించాడు. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు సంతోషంగా నవ్వుతూ అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు వైభవ్ సూర్యవంశి మంచి మనసుపై ప్రశంసలు గురిపిస్తున్నారు. అతడు ఇంత చిన్న వయసులోనే నిరుపేదలకు తన ఆస్తులు మొత్తం దానం చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">