Pietersen – Team India: క్రికెట్ లో ఓ లెజెండరీ ఆటగాడిగా గౌతమ్ గంభీర్ గొప్ప స్థాయిని అందుకున్నాడు. ఐపీఎల్ లోను మెంటార్ గా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. అలాగే 2024 జూలైలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు. దీంతో కోచ్ గా కూడా అతడికి తిరుగుండదని అంతా భావించారు. కానీ దీనికి అంతా రివర్స్ లో జరుగుతుంది. అతడు కోచ్ గా వచ్చినప్పటినుండి టీమిండియా విజయాల కంటే ఎక్కువగా వైఫల్యాలనే చవిచూస్తుంది.
Also Read: Virat Kohli House: కోహ్లీ కొత్త ఇల్లు ఇదే..32 కోట్లతో రెడీ.. గృహ ప్రవేశం ఎప్పుడంటే ?
గౌతమ్ గంభీర్ హయాంలో శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ లో ఓటమి, న్యూజిలాండ్ మీద టెస్ట్ సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఘోర ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇందుకు అతిపెద్ద కారణం బ్యాటింగ్ లో బ్యాట్స్మెన్ విఫలం కావడమే. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్ లో అట్టర్ ప్లాప్ కావడం ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును త్వరగా మెరుగుపెట్టాలన్న నేపథ్యంలో.. కొత్త కోచింగ్ సిబ్బందిని నియమించడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బ్యాటింగ్ కోచ్ ను తీసుకురావడానికి బీసీసీఐ నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం బీసీసీఐ బోర్డ్ అన్వేషణ మొదలుపెట్టినట్లు సమాచారం. టీమిండియా సపోర్ట్ స్టాఫ్ ని పెంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి.
డొమెస్టిక్ క్రికెట్ లెజెండ్స్ లో ఎవరినైనా బ్యాటింగ్ కోచ్ గా తీసుకుంటారని పలు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ గా మోర్కెల్, ఫీల్డింగ్ కి దిలీప్, అసిస్టెంట్ కోచ్ లుగా అభిషేక్ నాయర్, డెస్కాటే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్ పాత్ర కోసం క్రికెట్ అనుభవజ్ఞులను పరిశీలిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కొత్త కోచ్ నియామకం పట్ల గంభీర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతని ప్లేస్ సేఫ్ గానే ఉంటుంది.
Also Read: Axar patel – Rahul: కె.ఎల్ రాహుల్ కి షాక్.. ఢిల్లీ కెప్టెన్ గా డేంజర్ ఆల్ రౌండర్?
కోచ్ పదవిలో గంభీర్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంటాడు. గంభీర్ నేతృత్వంలోనే భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 t20 వరల్డ్ కప్, 2027 వరల్డ్ కప్ ఆడనుంది. అయితే బ్యాటింగ్ కోచ్ కోసం బీసీసీఐ అన్వేషిస్తున్న నేపథ్యంలో.. తాను భారత జట్టు బ్యాటింగ్ కోచ్ గా ఉండేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపారు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. బ్యాటింగ్ కోచ్ అన్వేషణలో బీసీసీఐ ఉందని ఓ రిపోర్టర్ చేసిన ట్వీట్ కి పీటర్సన్ రిప్లై ఇచ్చారు. తాను అందుబాటులో ఉన్నానని తెలిపారు. ఈ విషయంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Kevin Pietersen confirms his availability for team India batting coach position. 🇮🇳 pic.twitter.com/wgnC2TVyam
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 16, 2025