E-Paper
Advertisement

SRH దెబ్బ‌కొట్టేందుకు జితేష్ శ‌ర్మ ఫేక్ ఇంజురీ డ్రామాలు..రిష‌బ్ పంత్ ను కాపీ కొట్టి మ‌రీ

SRH దెబ్బ‌కొట్టేందుకు జితేష్ శ‌ర్మ ఫేక్ ఇంజురీ డ్రామాలు..రిష‌బ్ పంత్ ను కాపీ కొట్టి మ‌రీ
Advertisement

RCB VS SRH:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru) జట్ల మధ్య 67వ మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం (Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విక్టరీ అందుకుంది. ఏకంగా 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన హైదరాబాద్.. బెంగళూరు పై పగ తీర్చుకుంది. అయితే ఇందులో హైదరాబాద్ ను ఓడించేందుకుగాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు చాలా కుట్రలు చేశారు. స్లెడ్జింగ్ తో పాటు ఫేక్ ఇంజురీ అయినట్లు మ్యాచ్ డిస్టర్బ్ చేశారు. టీ20 ప్రపంచ కప్ 2024 సందర్భంగా రిషబ్ పంత్ ఎలా చేశాడో అచ్చం అలాగే ఫేక్ ఇంజురీ అంటూ జితేష్ శర్మ (Jitesh Sharma’s Fake Injury Drama) నాటకాలు ఆడాడు.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

SRH దెబ్బ‌కొట్టేందుకు జితేష్ శ‌ర్మ ఫేక్ ఇంజురీ డ్రామాలు

Advertisement

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య నిన్న మ్యాచ్ జరుగుతుండగా ఇషాన్ కిషన్ అలాగే కాటేరమ్మ కొడుకు క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ అర్థ సెంచరీలు నమోదు చేసుకున్నారు. ఒకానొక సమయంలో స్కోర్ 300 కొట్టేలాగా హైదరాబాద్ కనిపించింది. అయితే 16వ ఓవర్ దగ్గర 200కు పైగా పరుగులు సాధించింది హైదరాబాద్. ఈ క్రమంలోనే తనకు గాయమైనట్లు జితేష్ శర్మ డ్రామాలాడాడు. కిందపడి విలవిలలాడిపోయాడు. దీంతో బెంగళూరు ఫిజియో రంగంలోకి దిగి… మ్యాచ్ మొత్తం డిస్టర్బ్ చేశాడు. దాదాపు 5 నుంచి 10 నిమిషాల వరకు మ్యాచ్ ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్, క్లాసెన్ ఇద్దరూ రిథమ్ మొత్తం కోల్పోయారు. ఆ తర్వాత క్లాసెన్ వెంటనే ఔట్ కాగా… ఇషాన్ కిషన్ పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో హైదరాబాద్ స్కోర్ బోర్డు అమాంతం తగ్గిపోయింది. లేకపోతే 270కి పైగా వెళ్ళేది. అప్పుడు హైదరాబాద్ కచ్చితంగా భారీ స్కోర్ తేడాతో విజయం సాధించి, రెండో స్థానానికి వెళ్ళేది. పక్క ప్లానింగ్ ప్రకారం.. రిషబ్ పంత్ లాగా వ్యవహరించి.. హైదరాబాద్ జట్టును దెబ్బ కొట్టాడు జితేష్ శర్మ. ఈ నేపథ్యంలో ఫోటోలు వైరల్ గా మారాయి.

2024 టి20 వరల్డ్ కప్ సమయంలో రిషబ్ పంత్ కు ఫేక్ ఇంజురీ

టి20 ప్రపంచ కప్ 2024 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చేందుకు రిషబ్ పంత్ (Rishabh Pant) తనకు గాయమైనట్లు నాటకాలు ఆడాడు. జితేష్ శర్మ లాగానే మైదానంలో కిందపడి గిలగిలా కొట్టేసుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రిథమ్ మొత్తం కోల్పోయారు. ఫలితంగా టి20 ప్రపంచ కప్ 2024 టైటిల్ ఇండియా నెగ్గింది. అచ్చం అలాగే జితేష్ శర్మ నిన్నటి మ్యాచ్ సందర్భంగా చేసి… హైదరాబాద్ ను దెబ్బ కొట్టాడు.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×