E-Paper
Advertisement

భారత్ లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ 765 RX లాంచ్, ధర ఎంతో తెలుసా?

భారత్ లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ 765 RX లాంచ్, ధర ఎంతో తెలుసా?
Advertisement

Triumph Street Triple 765 RX Launched: ప్రీమియం మిడ్ వెయిట్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌ లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ట్రయంఫ్ సరికొత్త బైక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ 765 RXను మార్కెట్ కు పరిచయం చేసింది. రూ.13.91 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో వచ్చిన ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్, స్టాండర్డ్ స్ట్రీట్ ట్రిపుల్ 765 RS కంటే మరింత స్పోర్టీగా, ట్రాక్ రైడింగ్‌ కు అనుకూలంగా రూపొందించబడింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించిన ఈ మోడల్‌ను ఇప్పుడు భారత్ లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ట్రయంఫ్.

2026 నుంచి ప్రొడక్షన్ నిలిపివేత

ఈ బైక్‌ను ప్రత్యేకంగా పరిమిత కాలం పాటు మాత్రమే తయారు చేయనున్నారు. కంపెనీ ఇప్పటికే 2026 చివరి నాటికి దీని ఉత్పత్తిని నిలిపివేస్తామని స్పష్టం చేసింది. అందువల్ల ఇది కలెక్టర్ ఎడిషన్ మాదిరిగా కూడా మారే అవకాశం ఉందని బైక్ అభిమానులు భావిస్తున్నారు. స్ట్రీట్ ట్రిపుల్ 765 RX ప్రధానంగా ట్రాక్ ఫోకస్‌ తో రూపొందించబడిన వెర్షన్. సాధారణ RS మోడల్‌ తో పోలిస్తే ఇందులో రైడింగ్ పొజిషన్ మరింత అగ్రెసివ్‌ గా ఉంటుంది. ట్రయంఫ్ ఇందులో క్లిప్ ఆన్ హ్యాండిల్‌ బార్లను అందించింది. ఇవి రైడర్‌ కు స్పోర్టీ ఫీలింగ్‌ తో పాటు హై స్పీడ్‌ లో మెరుగైన కంట్రోల్‌ ను ఇస్తాయి.

ఆకట్టుకుంటున్న డిజైన్

Advertisement

డిజైన్ పరంగా కూడా ఈ బైక్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. సిల్వర్ కలర్ పెయింట్ స్కీమ్‌ కు రెడ్ సబ్‌ ఫ్రేమ్‌ ను యాడ్ చేయడం  వల్ల బైక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వీల్స్‌ పై ప్రత్యేక పిన్‌ స్ట్రైప్ డిజైన్, సైలెన్సర్, సీట్ యూనిట్‌ పై RX బ్యాడ్జింగ్ ఈ మోడల్‌ కు ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి.

ఇంజిన్ గురించి..

ఈ బైక్ లో స్ట్రీట్ ట్రిపుల్ 765 RSలో ఉన్నట్లుగానే 765cc లిక్విడ్ కూల్డ్ ఇన్‌ లైన్ ట్రిపుల్ ఇంజిన్‌ ను అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 130 హార్స్ పవర్, 80Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో పాటు బై డైరెక్షనల్ క్విక్‌ షిఫ్టర్‌ ను స్టాండర్డ్‌ గా అందించారు. దీంతో క్లచ్ ఉపయోగించకుండా గేర్ మార్చుకునే సౌకర్యం లభిస్తుంది. సస్పెన్షన్ సెటప్ ఈ బైక్‌ లో హైలైట్‌ గా చెప్పొచ్చు. ముందు భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ ఓహ్లిన్స్ NIX30 USD ఫోర్క్‌ లను ఇచ్చారు. వెనుక భాగంలో ఓహ్లిన్స్ STX40 మోనోషాక్ కొనసాగించారు. ట్రాక్ రైడింగ్ సమయంలో మెరుగైన స్టెబులిటీ, కంఫర్ట్ కోసం ఈ సెటప్ ఉపయోగపడుతుంది.

Advertisement

బ్రేకింగ్ కోసం ముందు భాగంలో బ్రెంబో స్టైల్మా ఫోర్ పిస్టన్ కాలిపర్లతో కూడిన డ్యూయల్ 310mm డిస్క్‌ లు, వెనుక భాగంలో 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. పిరెల్లీ డయాబ్లో సూపర్‌ కోర్సా SP V3 టైర్లను అమర్చడం వల్ల హైస్పీడ్ కార్నరింగ్ సమయంలో మంచి గ్రిప్ లభిస్తుంది.

ధర ఎంత అంటే?

ధర విషయానికి వస్తే, ఈ RX వెర్షన్ ధర స్టాండర్డ్ RS మోడల్ కంటే దాదాపు లక్ష రూపాయలు ఎక్కువ. అయితే, అదనపు ధరకు ప్రీమియం ఓహ్లిన్స్ ఫ్రంట్ సస్పెన్షన్, ప్రత్యేక హ్యాండిల్‌ బార్లు, లిమిటెడ్ ఎడిషన్ డిజైన్ లాంటి ప్రత్యేక ఫీచర్లు లభిస్తున్నాయి. ట్రాక్ రైడింగ్‌ ను ఇష్టపడే రైడర్లకు ఈ కొత్త ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్  765 RX మంచి ఆప్షన్ గా మారే అవకాశం ఉంది.

Read Also: భారత్‌ లో కొత్త బైక్‌ల హంగామా.. మే ఎండింగ్ లో లాంచ్ కానున్న టాప్ 5 మోడళ్లు ఇవే!

Related News

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

Big Stories

Advertisement
×