Khushdil Shah leave Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టు అస్తవ్యస్తంగా తయారైంది. ఆ జట్టు ఎప్పుడు సరిగ్గా రాణిస్తుందో ? ఎప్పుడు అట్టర్ ఫ్లాఫ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. నఖ్వీ తీసుకునే నిర్ణయాలు గందరగోళానికి గురిచేస్తూ ఉంటాయి. బాబర్ ఆజంకు తాజాగా కెప్టెన్సీ ఇచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టును కుదిపేసే ఓ న్యూస్ బయటకు వచ్చింది. మహమ్మద్ అమీర్ తరహాలోనే మరో క్రికెటర్ పాకిస్తాన్ దేశాన్ని వదిలేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ క్రికెటర్ ఎవరో కాదు పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఖుష్దిల్ షా. పాకిస్తాన్ జట్టులో తనకు సరిగ్గా అవకాశాలు రావడంలేదని.. తన పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఖుష్దిల్ షా (Khushdil Shah). మరో మూడు లేదా నాలుగు నెలల్లో తనకు పాకిస్తాన్ జట్టులో అవకాశం రాకపోతే… దేశం విడిచి వెళ్ళిపోతానని హెచ్చరించారు. మరో అంతర్జాతీయ క్రికెట్ జట్టు తరఫున బరిలోకి దిగుతానని.. దానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. దీంతో ఖుష్దిల్ షా ఇచ్చిన స్టేట్ మెంట్ పాకిస్తాన్ క్రికెట్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ జట్టు ఆల్ రౌండర్ ఖుష్దిల్ షా నోరు విప్పాడు. ఎంత బాగా ఆడినా కూడా తనకు జాతీయ జట్టుల అవకాశం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మందికి మాత్రమే నఖ్వీ అవకాశాలు ఇస్తూ.. తన లాంటి వాళ్లను తొక్కేస్తున్నాడని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే దేశం దాటి వెళ్లిపోయే ఆలోచన తనకు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగు నెలలు మాత్రమే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అవకాశం ఇస్తా.. ఆ లోపు తనను జాతీయ జట్టులోకి తీసుకోవాలి… లేకపోతే తానే వెళ్లిపోతామని ప్రకటించారు. మరో దేశానికి వెళ్లి… అక్కడి నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని ప్రకటించేశారు. మహమ్మద్ అమీర్ కూడా ఇటీవల బ్రిటిష్ పౌరసత్వాన్ని తీసుకున్నాడని… అతనిలాగే తాను వెళ్లిపోతానని వెల్లడించారు ఖుష్దిల్ షా.
పాకిస్తాన్ ఆల్రౌండర్ ఖుష్దిల్ షా టీ20 క్రికెట్ లో వేగవంతమైన సెంచరీ చేసిన రికార్డు ఉంది. 2020 నేషనల్ టి20 కప్ సందర్భంగా సదరన్ పంజాబ్ తరఫున ఆడుతూ… కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్ లో ఇప్పటి వరకు ఎవరు అందుకొని రికార్డ్ కావడం గమనార్హం. ఇదే సెంచరీ చేసినప్పుడు 18 బంతుల్లో అర్థ సెంచరీ చేసి మరో రికార్డు క్రియేట్ చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ 2022లో ముల్తాన్ సుల్తాన్ జట్టు తరఫున 16 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. లోయర్ ఆర్డర్ లో దూకుడుగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ ఖుష్దిల్ షా. ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో పాటు స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేస్తాడు. ఇలాంటి క్రికెటర్ కచ్చితంగా పాకిస్తాన్ జట్టుకు అవసరం. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఖుష్దిల్ షా అవసరం ఆ జట్టుకు ఉంటుంది. కానీ నఖ్వీ చర్యల వల్ల… ఇలాంటోళ్లు మరుగున పడుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి.