Kevin Pietersen On Ind vs Japan match: జపాన్ తో (Japan) జరిగిన మ్యాచ్ లో టీమిండియా ( Team India) చెత్త ప్రదర్శన కనబరిచిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ( Kevin Pietersen ) సంచలన పోస్ట్ పెట్టారు. ఫ్లాట్ ట్రాక్స్ లేకుండా విదేశాలలో ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించాలని కోరారు. ఈ ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడితే టీమ్ ఇండియా ప్లేయర్ల బాగోతం మొత్తం బయటపడుతుందని బాంబు పేల్చారు. ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్న టీమిండియా ప్లేయర్లందరూ.. ఫ్లాట్ ట్రాక్స్ కు అలవాటైపోయారని మండిపడ్డారు.
విదేశీ మైదానాలలో ఒక్కడుంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడడం లేదని సీరియస్ అయ్యారు. ఇండియన్ మైదానాలలో సెంచరీలు.. అవసరమనుకుంటే డబ్బులు సెంచరీలు కొడుతున్నారు… కానీ విదేశీ పర్యటనల్లో మాత్రం తోక ముడుస్తున్నారని చురకలు అంటించారు. ఒక మ్యాచ్ కాదు.. ఐపీఎల్ సీజన్ మొత్తం విదేశాల్లో నిర్వహిస్తే, టీమిండియా ప్లేయర్ల పరువు మొత్తం గంగలో కలుస్తుందని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ జపాన్ పైన జరిగిన మ్యాచ్ పై కూడా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ( Kevin Pietersen ) కీలక వ్యాఖ్యలు చేశారు. జపాన్ మ్యాచ్ లో అద్భుతాలు జరుగుతాయని తాను అంచనా వేసుకున్నానని తెలిపారు. కానీ ఎప్పటిలాగే టీమిండియా ప్లేయర్లు విదేశీ గడ్డపై తననే కాదు…. యావత్ భారతదేశాన్ని అవమానించారని ఫైర్ అయ్యారు. జపాన్ పైన రికార్డు విజయం కాదు… గెలుపు కోసమే నాన కష్టాలు పడ్డారని పరువు తీశారు. ఇలా అయితే టీమిండియా… వరల్డ్ కప్ ట్రోఫీలు గెలవడం కష్టమేనని హెచ్చరించారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో విదేశీ మైదానాలలో ఆడటం నేర్చుకోవాలని చురకలు అంటించారు.
జపాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన ఏకైక టీ20 చాలా ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. చివరలో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేసి టీమిండియాను గెలిపించాడు. లేకపోతే జపాన్ ముందు టీమిండియా పరువు గంగలో కలిసేది. ఈ మ్యాచ్ 5 ఓవర్ల కు కుదించగా టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ డకౌట్ కాగా… ఇషాన్ కిషన్ అలాగే సంజు శాంసన్ విఫలమయ్యారు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జపాన్… పోరాడి ఓడిపోయింది. మూడు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసి.. రెండు పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది.
.