E-Paper
Advertisement

బీసీసీఐ మొద్దు నిద్ర వీడాలి.. 150 KPH వేగంతో వేసే బౌలర్లను కాపాడాలి

బీసీసీఐ మొద్దు నిద్ర వీడాలి.. 150 KPH వేగంతో వేసే బౌలర్లను కాపాడాలి
Advertisement

Munaf Patel On Team India Bowlers:  ఫాస్ట్ బౌలర్లను తీర్చిదిద్దడంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ టీమిండియా క్రికెటర్, మిడియం ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ లాగా 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉన్న బౌలర్.. టీమిండియాలో ఒక్కడూ  లేడని ధ్వజమెత్తారు. షోయబ్ అక్తర్ లాగా వేసేందుకు వచ్చిన బౌలర్లను కూడా, ఎదగనివ్వడం లేదని విమర్శలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహారం సరిగ్గా లేకపోవడంతో…. 150 కిలో మీటర్ల వేగంతో వేసే బౌలర్లు కనుమరుగు అయిపోతున్నారని బాంబు పేల్చారు. మయాంక్ యాదవ్, జమ్మూ కాశ్మీర్ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ ఇద్దరు కూడా షోయబ్ అక్తర్ తరహాలో ఫాస్ట్ గా బౌలింగ్ చేస్తారని వెల్లడించారు. కానీ వాళ్లను బీసీసీఐ సరిగ్గా వాడుకోవడం లేదని విమర్శలు చేశారు. దీంతో మునాఫ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఫాస్ట్ బౌలర్లను బీసీసీఐ కాపాడుకోవాలి…మునాఫ్ పటేల్ సీరియస్

ఇమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్ లాంటి బౌలర్లకు సరిగ్గా అవకాశాలు ఇవ్వడం లేదని బీసీసీఐపై మునాఫ్ పటేల్ ఘాటు విమర్శలు చేశారు. వీళ్ళు వచ్చి రాగానే, మ్యాచ్‌లు గెలిపించాల్సిందే… వికెట్లు పడగొట్టాల్సిందే అన్నట్లుగా బీసీసీఐ ఒత్తిడి పెంచుతోందని ఫైర్ అయ్యారు. దాని వల్ల ఒకటి లేదా రెండు మ్యాచ్ లు ఆడి… ఆ తర్వాత టీమ్ ఇండియాలో అవకాశాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు మునాఫ్ పటేల్. ఈ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఎలాంటి ప్రణాళికలు  చేయడం లేదని విమర్శలు చేశారు. ఫాస్ట్ బౌలర్లపై గంభీర్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కోరారు. తనకు నచ్చిన వాళ్లను కాకుండా, టీమిండియాకు కావాల్సిన వాళ్లను ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

పత్తా లేకుండా పోయిన ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్

మయాంక్ యాదవ్ భయంకరమైన ఫాస్ట్ బౌలర్. అతడు వేసే ప్రతీ బంతి 145 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తాడు. 2024 ఐపీఎల్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా 156.7 కిలో మీటర్ల వేగంతో బంతి వేసి, రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ, తరచూ గాయపడ్డాడు. అటు బంగ్లాదేశ్ జరిగిన టీ20 మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. మళ్లీ అతడికి టీమిండియాలో ఛాన్స్ ఇవ్వలేదు. అటు ఉమ్రాన్ మాలిక్ పరిస్థితి మరీ దారుణం. ఐపీఎల్ తో పాటు 2023లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ లోనూ 157 కిమీ వేగంతో బంతులు సంధించాడు ఉమ్రాన్ మాలిక్. కానీ ఇప్పుడు ఇతడు ఐపీఎల్, అటు టీమిండియాలో ఎక్కడా కనిపించడం లేదు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

జపాన్‌‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు

ఆ ఇద్దరూ దరిద్రుల వల్ల, నాకు నిద్ర లేకుండా పోయింది…గంభీర్ కామెంట్స్ వైరల్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

Big Stories

Advertisement
×