E-Paper
Advertisement

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్
Advertisement

Mark Wood Private Jet story:   అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెటర్ మార్క్ వుడ్ ఐపీఎల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా గొప్పదని వెల్లడించిన ఆయన… ఎంతో మందికి జీవితాన్ని అందిస్తోందని ప్రశంసించారు. తనకు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్.. ఏకంగా ప్రైవేట్ జెట్ పంపిస్తానని ఆఫర్ చేసినట్లు గుర్తు చేశారు. తాను తీవ్రమైన జ్వరంతో హోట‌ల్ లోనే రెస్ట్ తీసుకుంటున్న సమయంలో …ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ ఒక‌రు తనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వివరించారు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే… వెంటనే జట్టులో చేరిపో… నీ కోసం ప్రైవేట్ జెట్ విమానం పంపిస్తానని ఆఫర్ చేసినట్లు స్పష్టం చేశారు మార్క్ వుడ్. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా ఓ సీజన్ మధ్యలో మార్క్ వుడ్ తీవ్రమైన జ్వరం బారిన పడ్డారు. ఈ క్రమంలో మంచం దిగి నిలబడలేని పరిస్థితి అతనికి వచ్చింది. అప్పటికే 5 మ్యాచ్ లు ఆడి… సదరు జట్టుకు సంబంధించిన హోటల్ కు వెళ్లిపోయాడు మార్క్ వుడ్. మరో మూడు రోజుల్లో మ్యాచ్ ఉంది. నిత్యం ఆ జట్టుకు సంబంధించిన డాక్టర్… మార్క్ వుడ్ పరిస్థితిని చెక్ చేస్తూనే ఉన్నారు. అయితే మ్యాచ్… లోకల్ లో కాకుండా, మరో జట్టుకు సంబంధించిన హోమ్ గ్రౌండ్ లో జరగనుంది. ఇలాంటి క్రమంలో మార్క్ వుడ్ కు సదరు జట్టు ఓనర్ ఫోన్ కాల్ చేశాడు. మిస్టర్ మార్క్ వుడ్… మ్యాచ్ కు సిద్ధం అయ్యావా ? ఆరోగ్యం ఎలా ఉంది ? నీ కోసం ప్రత్యేకంగా జెట్ విమానం పంపిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మళ్లీ.. నీ రూమ్ లో అదే విమానం దించుతుందని క్లియర్ కట్ గా ఆ జట్టు ఓనర్ వెల్లడించారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

ఆఫ‌ర్ తిర‌స్క‌రించిన మార్క్ వుడ్

ఐపీఎల్ ఓన‌ర్ ఇచ్చిన ప్రైవేట్ జెట్ ఆఫర్ విన్న మార్క్ వుడ్, తన తండ్రి కి ఫోన్ చేశాడు. ఇలా జెట్ విమానం పంపిస్తానన్నారు.. నాకు ఆరోగ్యం బాగాలేదు… ఏం చేయమంటారు నాన్నగారు అని తన తండ్రిని అడిగారు మార్క్ వుడ్. నీ వల్ల కాకపోతే వదిలేయ్ అని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. దీంతో ఐపీఎల్ ఓనర్ ఇచ్చిన ప్రైవేటు జెట్ ఆఫర్ ను సున్నితంగా మార్క్ వుడ్ తిరస్కరించారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

 

Related News

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టి..బౌన్సర్లతో టార్చర్ చేస్తాం

Big Stories

Advertisement
×