PAK vs NZ: క్రికెట్ మ్యాచ్ లో ( Cricket ) అనేక రకాల వింతలు జరుగుతూ ఉంటాయి. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో రకమైన సంఘటనలు మనం చూసే ఉంటాం. అయితే.. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పవర్ కట్ కావడం మనం చూసే ఉంటాం. దానివల్ల మ్యాచ్ కు దాదాపు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు కలుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్లడ్ లైట్స్ కూడా ఆగిపోతూ ఉంటాయి. దానివల్ల మ్యాచ్ కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయితే అచ్చం ఇలాంటి సంఘటనే తాజాగా మరోటి జరిగింది.
Also Read: LSG Vs MI: తిలక్ రిటైర్డ్ హర్ట్.. పాండ్యా పై ట్రోలింగ్.. అసలు ఈ వివాదం ఏంటి?
పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల ( Pakistan vs New Zealand teams ) మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. ఒక్కసారిగా స్టేడియం మొత్తం కరెంటు పోయింది. ఫ్లడ్ లైట్లతో పాటు… స్టేడియంలో మిగతా ప్రాంతాల్లో కూడా కరెంటు కట్ అయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బే ఓవల్ లో ( Bay Oval, Mount Maunganui ) తాజాగా మూడవ వన్డే జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై మరోసారి విజయం సాధించింది న్యూజిలాండ్. ఏకంగా 43 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఈ న్యూజిలాండ్ టీం. ఇప్పటికే ఈ వన్డే సిరీస్ గెలుచు కున్న న్యూజిలాండ్.. మూడవ వన్డేలో కూడా విజయం సాధించింది.
Also Read: Digvesh Singh Rathi: మరోసారి వివాదం… దిగ్వేశ్‌కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!
ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ( ( Pakistan ) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పవర్ కట్ ( Power Cutt) అయింది. సరిగ్గా 39వ ఓవర్… బౌలింగ్ వేసేందుకు న్యూజిలాండ్ ఆటగాడు డుఫ్ఫి ( Jacob Duffy ) వచ్చాడు. అప్పటికే ఈ 39 ఓవర్ లో మూడు బంతులు వేసి ఒక ఫోర్ కూడా ఇచ్చాడు. అటు.. పాకిస్తాన్ ఆటగాడు తయ్యాబ్ 33 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. నాలుగో బంతి వేసేందుకు డుఫ్ఫి ( Jacob Duffy )… వస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా లైట్స్ మొత్తం ఆగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లైవ్ చూసినవారు అలాగే స్టేడియం లో ఉన్నవారు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అసలు స్టేడియంలో ఏం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 నిమిషాల తర్వాత… పరిస్థితి యధా విధికి వచ్చింది. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల ( Pakistan vs New Zealand teams ) మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్ లో సులభంగా మ్యాచ్ గెలిచింది కివీస్.
అండర్ టేకర్ మూమెంట్..?
న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ కావడంతో… అందరూ అండర్టేకర్ మూమెంట్ ను గుర్తు చేసుకుంటున్నారు. అండర్టేకర్ కూడా ఎంట్రీ ఇచ్చినప్పుడు లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇక… ఈ మ్యాచ్ లో కూడా అచ్చం అలాగే జరిగింది. దీంతో సోషల్ మీడియాలో అండర్టేకర్ పేరును వైరల్ చేస్తున్నారు.
ZIMBABAR Ne Lights Band Kardi 😂.#PAKvNZ #NZvPAK #BabarAzam #PakistanCricket pic.twitter.com/HZJbr0LGWF
— 𝑺𝒉𝒆𝒓𝒂 (@IamShera3) April 5, 2025
#Undertaker's entry in #NZvsPAK match 😂😂#WWERaw #WWENXT pic.twitter.com/wuFnpLlYxn
— FIGHTER (@45RohiRat18Fan) April 5, 2025