BigTV English

Tilak Varma: తిలక్ వర్మ వివాదం… రిటైర్డ్ హర్ట్.. రిటైర్డ్ ఔట్ తేడాలివే?

Tilak Varma: తిలక్ వర్మ వివాదం… రిటైర్డ్ హర్ట్.. రిటైర్డ్ ఔట్ తేడాలివే?

Tilak Varma: టీమ్ ఇండియా టి-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. తిలక్ వర్మ కోసం జట్టులో మూడవ స్థానాన్ని కూడా త్యాగం చేశాడు సూర్య. దీంతో ప్రపంచంలోనే నెంబర్ 2 ర్యాంక్ కి చేరాడు తిలక్. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లోను ముంబై ఇండియన్స్ తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడిన క్రికెటర్ తిలక్ వర్మ. గతేడాది ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ తర్వాత ఐపిఎల్ లో అత్యధిక పరుగులు చేసింది తిలక్ వర్మ.


 

అలాంటి క్రికెటర్ ని శుక్రవారం రోజు లక్నోతో జరిగిన మ్యాచ్లో రిటైర్డ్ అవుట్ గా ప్రకటించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. జట్టు త్వరగా పరుగులు సాధించాల్సిన సమయంలో తిలక్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం, బౌండరీ కొట్టడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో 23 బంతుల్లో తిలక్ వర్మ రెండు ఫోర్లతో 25 పరుగులు మాత్రమే చేశాడు. అలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం చూసిన ముంబై జట్టు 19 వ ఓవర్ లో అతడిని రిటైర్డ్ ఔట్ చేసింది.


దీని తర్వాత తిలక్ వర్మ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన మిచెల్ శాంట్నర్ రెండు బంతుల్లో రెండు పరుగులే చేశాడు. దీంతో ముంబై జట్టు ఈ మ్యాచ్ గెలవలేకపోయింది. అయితే క్రికెట్ లో రిటైర్డ్ హార్ట్, రిటైర్డ్ అవుట్ పదాలు ఒకేలా ఉన్నా.. వీటి మధ్య కాస్త తేడా ఉంటుంది. ఒక ఆటగాడిని వ్యూహంలో భాగంగా జట్టు అవుట్ అని పిలిచినప్పుడు రిటైర్డ్ అవుట్ గా సంభవిస్తుంది. అదే ఒక ఆటగాడు గాయం కారణంగా మైదానం వదిలి వెళ్ళినప్పుడు రిటైర్డ్ హార్ట్ సంభవిస్తుంది.

రిటైర్డ్ అవుట్ అంటే.. క్రికెట్ లో ఒక బ్యాటర్ స్వయంగా, లేదా కెప్టెన్ ఆదేశాల మేరకు అవుట్ కాకుండా మైదానాన్ని విడిచి వెళ్లిపోతే అతడు రిటైర్డ్ అవుట్ అయినట్లు. ఈ పరిస్థితిలో అంపైర్ అతడిని అవుట్ గా ప్రకటించరు. కానీ అతడు డ్రెస్సింగ్ రూమ్ కి తిరిగి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు అతడు మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉండదు. ఆ బ్యాటర్ స్కోర్ పక్కన అవుట్ అని రాయబడుతుంది. ఇది జట్టు వ్యూహంలో భాగం. గాయం లేదా అత్యవసర పరిస్థితి కారణంగా మైదానాన్ని విడిచిపెట్టే నిర్ణయం కాదు.

ఇక రిటైర్డ్ హార్ట్ అంటే.. ఒక బ్యాటర్ గాయం లేదా అనారోగ్యం కారణంగా మైదానాన్ని విడిచి వెళితే దానిని రిటైర్డ్ హార్ట్ అంటారు. ఈ పరిస్థితిలో బ్యాటర్ తన సమస్యను అంపైర్ కి చెప్పి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళచ్చు. అయితే రిటైర్డ్ హార్ట్ అయిన ఆటగాడికి మళ్ళీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అది టీమ్ వికెట్ పడిపోయినప్పుడు లేదా మరొక ఆటగాడు రిటైర్డ్ అయినప్పుడు మాత్రమే. అయితే ఇతడు తిరిగి క్రీజ్ లోకి రావాలంటే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అనుమతి అవసరం. శుక్రవారం రోజు తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ గా గ్రౌండ్ ను వీడారు. ఇదే ఈ రెండిటి మధ్య అతి ముఖ్యమైన తేడా.

 

అయితే మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ ఎపిసోడ్ పై ముంబై కోచ్ జయవర్ధనే స్పందించారు. ” తిలక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య కుమార్ యాదవ్ తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించాడు. కానీ చివర్లో అతడు దూకుడు పెంచాలని చూసినా కుదరలేదు. దీంతో అతడిని అక్కడికే ఆపి కొత్తగా ఎవరినైనా పంపించాలని నిర్ణయించాం. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నప్పుడు ఒత్తిడి పెంచకూడదు. క్రికెట్ లో ఇవన్నీ సహజం. అతడిని అవుట్ గా ప్రకటించడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ జట్టు వ్యూహంలో భాగంగా అలా చేయాల్సి వచ్చింది ” అని వెల్లడించాడు.

Tags

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×