OTT Movie : కొన్ని కొరియన్ సిరీస్ లు చూస్తున్నప్పుడు మనసుకు హాయిగా అనిపిస్తుంది. సరదా సన్నివేశాలు , ఎమోషన్స్, రొమాంటిక్ కామెడీతో ఈ కొరియన్ సిరీస్ లు చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ కో-లివింగ్ హౌస్ నేపథ్యంలో జరుగుతుంది. ఇక్కడ ఒకే ఇంట్లో ఒంటరితనంతో బాధపడే అమ్మాయిలు, అబ్బాయిలు కలసి ఉంటారు. నచ్చితే రిలేషన్ పెట్టుకుంటారు. అది కూడా తాత్కాలికంగానే. ఇక ఈ కో-లివింగ్ హౌస్ లో జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమింగ్
‘లోన్లీ ఎనఫ్ టు లవ్’ (Lonely Enough to Love) 2020లో విడుదలైన కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్. ఇది లీ హ్యూన్ జూ దర్శకత్వంలో, జో జిన్ కూక్ రాసిన స్క్రీన్‌ప్లే ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్‌లో కిమ్ సో-యున్ (లీ నా-యున్), జి హ్యూన్-వూ (చా కాంగ్-వూ), పార్క్ గియోన్-ఇల్ (హ్యూన్ జిన్), హాన్ జి-వాన్ (జియాంగ్ హన్-బి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఒక కో-లివింగ్ హౌస్‌లో నివసించే యువతుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇది 2020 ఆగస్టు 11 నుండి 2020 అక్టోబర్ 13 వరకు MBC every1 ఛానెల్‌లో ప్రసారమైంది, ఇది రాకుటెన్ వికీ, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, అమెజాన్ మినీటీవీ ప్లాట్ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈ సిరీస్ 10 ఎపిసోడ్‌లతో ఒక్కో ఎపిసోడ్ సుమారు 60 నిమిషాల నిడివి ఉంటుంది. IMDbలో ఈ సిరీస్ కి 6.3/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సిరీస్ ఒక కో-లివింగ్ హౌస్ లో నివసించే యువత చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ నివసించే వారు ఒంటరితనం భరించలేక ప్రేమలో పడాలని కోరుకుంటారు. కానీ సీరియస్ రిలేషన్‌షిప్‌లు వద్దనుకుంటారు. ఈ కథ ప్రధానంగా నా-యున్, కాంగ్-వూ చుట్టూ తిరుగుతుంది. వీరు ఒంటరితనంతో బాధపడుతూ, కొత్త పరిచయాల కోసం ఎదురుచూస్తుంటారు. లీ నా-యున్ ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్. రచయిత్రి కావాలనే కలతో ఉంటుంది. కానీ గత నాలుగు సంవత్సరాలుగా ఆమెకు బాయ్‌ఫ్రెండ్ లేడు. ఆమె ఇంట్లో సమస్యల కారణంగా కో-లివింగ్ హౌస్‌లోకి మారుతుంది. ఇక్కడ కొంతమంది ఒకేఇంట్లో ఉంటూ రిలేషన్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అక్కడ ఆమె చా కాంగ్-వూ అనే ఒక 30 ఏళ్ల సైకియాట్రిస్ట్‌ను కలుస్తుంది. కాంగ్-వూ గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా రొమాంటిక్ సంబంధాలకు భయపడుతుంటాడు.
Read Also : అద్దంలో అరుదైన ప్రపంచం… 10 సెకన్లలో 50 నిమిషాల ఎక్స్పీరియన్స్… గూస్ బంప్స్ తెప్పించే సై-ఫై థ్రిల్లర్