Shardul Thakur LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో… అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఐపీఎల్ యాజమాన్యం ( IPL ). మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ కొనసాగుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో…. లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants ) కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా డేంజర్ ప్లేయర్ ను తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్. రేపటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా జట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Also Read: IPL 2025: రేపటి నుంచే ఐపీఎల్ 2025..టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?
ఇందులో భాగంగానే లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కూడా కీలక మార్పు జరిగింది. ఆ జట్టులోకి శార్దూల్ ఠాకూర్ ( Shardul Thakur ) వచ్చేసాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయంతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అతను ఈసారి ఐపీఎల్ ఆడటం కష్టమే అని తేలిపోయింది. దీంతో ఈసారి శార్దూల్ ఠాకూర్ ను మొహ్సిన్ ఖాన్ స్థానంలో తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే కోల్కత్తా నైట్ రైడర్స్ లాంటి జట్లకు శార్దూల్ ఠాకూర్ ఆడిన సంగతి తెలిసిందే.
ఆల్ రౌండర్ గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు శార్దూల్ ఠాకూర్. కానీ మొన్న 2024 చివర్లో జరిగిన మెగా వేలంలో షార్దుల్ ఠాకూర్ ను ఎవరు కొనుగోలు చేయలేదు. తర్వాత ఇండియాలో జరిగిన దేశవాళీ క్రికెట్లో… తన సత్తా ఏంటో నిరూపించాడు శార్దుల్ ఠాకూర్. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ లో కూడా రానించి శభాష్ అనిపించుకున్నాడు శార్దూల్ ఠాకూర్. ఈ నేపథ్యంలోనే శార్దుల్ ఠాకూర్ టీమిండియాలోకి వస్తాడని కూడా ప్రచారం జరిగింది. కానీ అతనికి ఛాన్స్ ఇవ్వలేదు భారత క్రికెట్ నియంత్రణ మండలి.
కానీ ఇప్పుడు లక్నో సూపర్ జెంట్స్ మాత్రం అద్భుతమైన అవకాశం యంగ్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ కు ఇచ్చింది. మొన్న మెగా వేలంలో అన్సోల్డ్ ప్లేయర్ గా (Un Sold ) నిలిచిన శార్దుల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకుంటుందని సమాచారం అందుతుంది. ఒకవేళ ఇదే జరిగితే… శార్దుల్ ఠాకూర్ తన ఆట తీరును కచ్చితంగా ఐపీఎల్లో ( IPL 2025 ) ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాణిస్తేనే మళ్లీ టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ చేసే సత్తా ఉన్న శార్దూల్ ఠాకూర్.. సేవలు కచ్చితంగా టీమిండియా కు అవసరం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో బాగా ఆడితే మరో హార్దిక్ పాండ్యా తరహాలో… రాణిస్తాడు శార్దూల్ ఠాకూర్. లేకపోతే అతని కెరీర్ డేంజర్ లో పడే అవకాశాలు కూడా ఉంటాయి.