HCA – IPL Tickets: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} అనగానే ధనాధన్ మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. టీమ్ ఏదైనా, వేదిక ఎక్కడైనా.. ఇష్టమైన ఆటగాళ్ల కోసం అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ క్రికెట్ అభిమానులకి ఐపీఎల్ మ్యాచ్ లతో వచ్చే కిక్కే వేరు. ప్లేయర్ల బౌలింగ్, ధనాధన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లతో అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు.
Also Read: IPL’s Brand Value: లక్ష కోట్లు దాటిన ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ…!
ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ 18 వ సీజన్ కూడా అభిమానులను ఎంతగానో అలరిస్తూ దూసుకెళ్తోంది. తమ అభిమాన టీమ్స్ మ్యాచ్ లు చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. ఇక సన్రైజర్స్ అభిమానులు కూడా తమ అభిమాన జట్టు మ్యాచులు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో ఎస్.ఆర్.హెచ్ మ్యాచ్లతో పాటు ఓ క్వాలిఫైయర్, ఓ ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరగనుంది.
ఇప్పటికే హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తుగా ఓడించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక నేడు సెకండ్ ఫైట్ లో లక్నో సూపర్ జెయింట్స్ ని ఢీ కొట్టబోతోంది. ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా తరలిరానున్నారు అభిమానులు. ఈ మ్యాచ్ లో కూడా హైదరాబాద్ జట్టు గెలుపొందాలని, 300 పైగా స్కోర్ నమోదు చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు.
ఇక మ్యాచ్ కి ముందు వారిని మరింత ఎంటర్టైన్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈరోజు స్టేడియానికి రాబోతున్నారు. ఇలా ఈ సీజన్ క్రికెట్ లవర్స్ లో జోష్ నింపుతున్న వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ {హెచ్.సీ.ఏ} కీలక ప్రకటన చేసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు దివ్యాంగులకు ఉచిత పాస్ లు {HCA – IPL Tickets} అందించబోతున్నట్లు ప్రకటించింది హెచ్సీఏ. ఈ మ్యాచ్లను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మెయిల్ చేయాలని సూచించింది హెచ్సీఏ.
Also Read: Jofra Archer: ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలర్ గా ఆర్చర్ రికార్డ్…?
దివ్యాంగులకు కాంప్లిమెంటరీ పాస్ లను అందించడానికి తమకు సంతోషంగా ఉందని, ఈ టికెట్లు కావలసినవారు ఈ మెయిల్ కి పూర్తి పేరు, కాంటాక్ట్ నెంబర్, వ్యాలీడ్ డిజబులిటీ ప్రూఫ్, ఏ మ్యాచ్ కోసం పాస్ కావాలో వంటి వివరాలను {pcipl18rgics@gmail.com} మెయిల్ కి పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని.. మొదట దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలించి ప్రాధాన్యత ఆధారంగా పాస్ లు జారీ చేస్తామని ప్రకటించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.