Big Stories

Venkatesh Prasad’s World Cup Squad: వెంకటేశ్ ప్రసాద్ టీమ్ లో.. ఆ ముగ్గురు లేరు..!

Venkatesh Prasad’s Preferred T20 World Cup Squad Tweet Stirs Up Buzz On Social Media:  ఐపీఎల్ మ్యాచ్ లు జోరుగా సాగుతున్నాయి. 74 మ్యాచ్ లకి 24 మ్యాచ్ లు జరిగిపోయాయి. దాదాపు పావువంతు పైనే అయిపోయాయి. అంటే చాలామంది ఆటగాళ్లు ఎవరు రేపు టీ 20 ప్రపంచకప్ లో ఉంటారనే దానిపై  దాదాపు అందరూ అంచనాలకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తను కొందరి పేర్లను ప్రకటించాడు.

- Advertisement -

ముఖ్యంగా ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టమని చెప్పాడు. దీంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎవరిని తప్పించమని చెప్పాడంటే కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్.. వీరు ముగ్గురు అవసరం లేదని అన్నాడు. అంటే వారు  ఆటకు పనికి రారని చెప్పలేదు. ఇప్పుడు ఐపీఎల్ లో వీరి ఫామ్ ను చూసి, ఆడించడం కరెక్ట్ కాదని తెలిపాడు. ఇక తను చెప్పిన పేర్లు ఎలా ఉన్నాయంటే…

- Advertisement -

ఆల్రడీ కెప్టెన్ గా రోహిత్ శర్మని ప్రకటించారు కాబట్టి, అతని ప్లేస్ కి వచ్చిన ఢోకా లేదు. ఇక విరాట్ కొహ్లీ ఇరగదీస్తున్నాడు కాబట్టి, తనపై సందేహ పడాల్సిన పనేలేదు. ఇద్దరు సీనియర్లకు ఢోకాలేదు. సూర్య కుమార్ యాదవ్ టీ 20 స్పెషలిస్ట్, తను ఉండాల్సిందేనని  అన్నాడు. రింకూ సింగ్ బెస్ట్ ఫినిషర్ కాబట్టి తను తప్పదని అన్నాడు.

Also Read: ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం.. రాజస్థాన్‌కు తొలి ఓటమి..

అన్నిటికన్నా మించి సీఎస్కేలో ఇరగదీస్తున్న శివమ్ దుబె మాత్రం కచ్చితంగా ఉండాల్సిందేనని అన్నాడు. తను ఆల్ రౌండర్ గా ఉంటాడు కాబట్టి, హార్దిక్ పాండ్యా అవసరం లేదని అన్నాడు. ఇప్పుడు కీపర్ కమ్ బ్యాటర్ కావాలి. వారిలో రిషబ్ పంత్, సంజు శాంసన్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. కానీ సంజు ఒక అడుగు ముందున్నాడని తెలిపాడు.

ఇంతవరకు వెంకటేష్ ప్రసాద్ చెప్పి ఊరుకున్నాడు. కానీ నెటిజన్లు ఊరుకుంటారా? మిగిలిన ఖాళీలు వారు ఫిల్ చేసేశారు. అవేమిటంటే బౌలర్ల విషయానికి వస్తే బుమ్రా, మహ్మద్ షమీ ఉంటారు. స్పిన్నర్లకు వచ్చేసరికి రవీంద్ర జడేజా, మరొకరు చాహల్, కులదీప్, ఉండవచ్చునని అంటున్నారు. మూడో పేసర్ కావాలంటే మయాంక్ యాదవ్ వస్తాడని చెప్పేస్తున్నారు.

మొత్తానికి వెంకటేష్ ప్రసాద్ టీమ్ ని ఇలా సెట్ చేశారు..
రోహిత్ శర్మ, యశస్వి, గిల్, విరాట్, సూర్య కుమార్ యాదవ్, శివమ్ దుబె, రింకూసింగ్, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ, మయాంక్, చాహల్, కులదీప్, రిషబ్ పంత్/సంజు శాంసన్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News