Indian cricket players : సాధారణంగా టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి స్టార్ క్రికెటర్ల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే వీరు టీమిండియా తరపున అద్భుతంగా ఆడుతారు. అయితే వీరిలో కొంత మంది అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన వారు ఉన్నారు. మరికొందరూ కేవలం వన్డే మ్యాచ్ లకే పరిమితం కాగా.. మరికొందరూ టెస్ట్ మ్యాచ్ లు, మరికొందరూ టీ-20 మ్యాచ్ లకి పరిమితమైన వారు ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే.. టీమిండియా క్రికెటర్ల కంటే తమ భార్యలు ఎక్కువగా సంపాదిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. టీమిండియాలో కొంత మంది భారతీయ క్రికెటర్ల భార్యలు విజయవంతమై కెరీర్, వ్యాపారాలను కలిగి ఉన్నారు. అది వారి మొత్తం సంపదకు దోహదం చేస్తుంది. ఈ వ్యక్తుల్లో కొంత మందికి అంచనా వేయబడిన ఆదాయాలు లేదా నికర విలువలకు సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Shubman Gill – Sara: లండన్ పార్టీలో గిల్ కు అవమానం… సారాతో క్లోజ్ గా యువరాజ్ !
విరాట్ కోహ్లీ- అనుష్కశర్మ :
ప్రముఖ నటి వ్యాపారవేత్త అనుష్క నికర విలువ దాదాపు 255 కోట్లకు పైగానే ఉంటుందట. ఆమె ఆదాయం నటన, ఆమెకి సంబంధించిన బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు, ఆమె దుస్తుల బ్రాండ్ నుష్ వంటి వ్యాపారాలు.. సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. మరోవైపు క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ ఉన్నాయి. దాదాపు ఆమె నెలసరి ఆదాయం రూ.1కోటికి పైగానే అన్న మాట. ఆమె నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ విలువ రూ.444 కోట్లు. అంటే భర్త విరాట్ కోహ్లీ కంటే ఎక్కువే అన్నమాట.
రోహిత్ శర్మ – రితికా సజ్దేహ్ :
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆమె విజయవంతమైన స్పోర్ట్స్ మేనేజర్ కూడా. అయితే రితికా తన భర్త బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు, కాంట్రాక్టులను నిర్వహిస్తోంది. ఆమె నిరక ఆదాయం విలువ దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుంది.
శార్దూల్ ఠాకూర్ – మిట్టాలి పరుల్కర్ :
టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. అతని భార్య కూడా వ్యాపారం రంగంలో రాణిస్తోంది. అతని భార్య మిట్టాలికి ఆల్ జాజ్ బేకరీ కలిగి ఉంది. ఆ బేకరీ వల్ల శార్దూల్ ఠాకూర్ కంటే ఎక్కువగానే ఆదాయం వస్తుందట. దీంతో భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి లిస్టులో ఈమె కూడా చేరిపోయింది.
రవీంద్ర జడేజా- రివాబా జడేజా :
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రికెట్ తన ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. అయితే అతని భార్య రివాబా రాజకీయ వేత్త, అలాగే గుజరాత్ శాసనసభ్యురాలు. వ్యాపారాల నుంచి ఆదాయాలు భారీగానే లభిస్తాయి. ఆమె మొత్తానికి రవీంద్ర జడేజా కంటే ఎక్కువగానే సంపాదిస్తుంది. వ్యాపారాల ఆదాయాల గురించి నిర్దిష్ట వివరాలను నిర్దారించడానికి కష్టంగా ఉంటుందని పలు నివేదికలు వెల్లడించాయి.
దీపక్ చాహర్ – జయ భరద్వాజ్ :
టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ ప్రారంభంలో ఎక్కువగా టీమిండియా తరపున ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాణిస్తున్నాడు. ఇతని ఆదాయం కంటే కూడా ఇతని భార్య ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆమె వ్యాపారంతో పాటు దీపక్ తో కలిసి ట్రేడ్ ఫాంటసీ గేమ్ లో కూడా పాల్గొంటుంది. జయ కార్పొరేట్.. మీడియా రంగంలో ప్రొఫెషనల్ గా పనిచేస్తోంది. ఇక కేవలం వీరు మాత్రమే కాదు. ఇంకా చాలా మందే ఉన్నారు. భర్తల కంటే ఎక్కువగా భార్యలు సంపాదిస్తున్నారు.