Brahmamudi serial today Episode:లాస్ట్ సిక్స్ మంత్ నుంచి కంపెనీ టర్నోవర్ బాగా తగ్గిపోయాయని అందుకోసం ఎండీని మార్చాలని బోర్డు మెంబర్స్ అందరూ నిర్ణయం తీసుకున్నారని సిద్దార్థ్ చెప్తాడు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు రావాలంటే నేను ఎండీ అవ్వడం ఒక్కటే మార్గం అని నమ్ముతున్నారు అని సిద్దార్థ్ చెప్పగానే.. అదంతా నేను రాకముందు సిద్దార్థ్ ఇక నేను వచ్చేశాను కదా..? ఇక్కడ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మన స్వరాజ్ కంపెనీ ఇకపై లాభాలు చూస్తుంది. అందులో మీకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదు అని రాజ్ చెప్తాడు. కానీ నాకు ఉంది రాజ్ ఇక్కడ మనం నడుపుతుంది చారిటీ కాదు బిజినెస్.. ఇక్కడ అందరికీ టార్గెట్ ఒక్కటే అది నువ్వు తీసుకొస్తావన్న నమ్మకం లేదు అంటాడు.
దీంతో రాజ్ ఎందుకో తెలుసుకోవచ్చా అని రాజ్ అడుగుతాడు. చాలా రోజులుగా నువ్వు ఆఫీసుకు రావడం లేదు. నీకు హెల్త్ కండీషన్ కూడా బాగా లేదని నాకు ఇంటర్నల్ గా తెలిసింది. ఇలాంటి సమయంలో నువ్వు ఆ పదవిలో ఉండటం కరెక్టు కాదని ఇది అందరి అభిప్రాయం అంటాడు సిద్దార్థ్. ఇది అందరి అభిప్రాయమా..? లేక నీ ఒక్కడిదా అని రాజ్ అడగ్గానే.. ఎవరిదైతే ఏముంది. నువ్వు ముందులా సక్సెస్‌ఫుల్‌గా కంపెనీని నడిపించగలవని నమ్మకం ఏంటి..? నిన్ను నమ్మి మేము అందరం మీ వెంట ఎందుకు నడవాలి. నువ్వు ముందులాగా తిరిగి లాభాలు తీసుకొస్తావన్న గ్యారంటీ ఏంటి..? సరే అవన్నీ పక్కనపెట్టు. నువ్వు ఉన్న కంపెనీకి అసలు కంపెనీలో గతంలో జరిగిన డీల్స్ గురించి నీకేమైనా తెలుసా..? ఇప్పటి వరకు మనం ఎంత టర్నోవర్ చేశామో ఐడియా ఉందా..? కనీసం మన క్లయింట్స్ ఎవరో నీకు గుర్తు ఉందా..? అంటూ సిద్దార్థ్ నిలదీస్తాడు.
దీంతో రాజ్ మెల్లగా లేచి నిలబడి స్వరాజ్ కంపెనీ గురించి కంపెనీ చరిత్ర గురించి చెప్తాడు. దీంతో సిద్దార్థ్ ఇదంతా రెండో తరగతి పిల్లాడికి నేర్పించినా చెప్పేస్తాడు.. అందులో ఏముంది అని అడుగుతాడు. నేను ఎండీగా చార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు 128 డీల్స్ చేశాను. అందులో అమెరికా నుంచి పందొమిది, ఇంగ్లాండ్ నుంచి 32, మలేషియా నుంచి 28, ఇంకా శ్రీలంక లాంటి దేశాల నుంచి చిన్న చిన్న డీల్స్ చేసి 25శాతం ఉన్న లాభాలను 42 శాతానికి తీసుకొచ్చాను. ఇది కూడా నేర్పిస్తే రెండో క్లాస్ పిల్లాడు కూడా చెప్పగలడు. కానీ కంపెనీ ఎండీ మాత్రమే చెప్పగలిగే విషయం నీకు చెప్పనా..? అంటాడు రాజ్.. ఏంటది అని సిద్దార్థ్ అడగ్గానే.. 2018 అంటే మీ నాన్న గారు బోర్డు మెంబర్‌గా ఉన్నప్పుడు జింబాబ్వే నుంచి ఇల్లీగల్‌గా గోల్డ్ తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టడానికి ట్రై చేశారు. ఆ విషయం తెలిసి నేను తనను బోర్డు మెంబర్‌గా తీసేయాలంటే మీ నాన్న వెళ్లి మా తాతయ్య కాళ్లు పట్టుకుంటే తిరిగి బోర్డు మెంబర్‌గా తీసుకున్నాము.. అదే ప్లేస్‌లో ఇప్పుడు నువ్వు కంటిన్యూ అవుతున్నావు.. ఇప్పటి వరకు ఈ విషయం నలుగురికి మాత్రమే తెలుసు నీకు మీ నాన్న గారికి నాకు మా తాత గారికి. మరి ఈ విషయాన్ని రెండో క్లాస్ పిల్లాడు చెప్పగలడా..? అంటూ రాజ్ అడగ్గానే.. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు.
మన సార్ వాడి గాలి మొత్తం తీసేశాడు అని శృతి నవ్వుకుంటుంది. ఈ విషయం నాకు కూడా తెలియదు మరి ఈయనకు ఎలా తెలిసింది అని కావ్య ఆలోచిస్తుంది. ఇంతలో రాజ్ ఇక నీ సంగతికి వస్తే.. నువ్వు కూడా మీ నాన్న గారి దారిలోనే నడుస్తున్నావు. నువ్వు తీసుకొచ్చిన 500 కోట్ల ప్రాజెక్ట్ ఫైల్ మొత్తం చదివాను. నువ్వు చెప్తున్న కంపెనీ అసలు లేనే లేదు. అది ఒక బోగస్ కంపెనీ కేవలం పేపర్స్ మీద మాత్రమే ఉంది. ఫేక్ లెక్కలు చూపించి కంపెనీ లాభాల్లో నడుస్తుందని వీళ్లందరినీ నమ్మించి మోసం చేస్తున్నావు అంటాడు. దీంతో బోర్డు మెంబర్ కోపంగా ఎంటి సిద్దార్థ్ గారు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా..? అని అడుగుతాడు. దీంతో రాజ్ కోపంగా మిమ్మల్ని కాదు కళావతి గారిని మాత్రమే మోసం చేయాలనుకున్నారు. తనను బాధ్యతల నుంచి తప్పించాలని ఇదంతా ప్లాన్ చేశాడు. కరెక్టేనా సిద్దార్థ్ అంటాడు రాజ్.
రాజు గారు అడుగుతుంటే మాట్లాడరేంటి..? నిజం చెప్పండి.. మేడం గారిని తప్పించి మీరు ఎండీ అవ్వాలనుకున్నారా..? అంటూ బోర్డు మెంబర్స్ సిద్దార్థ్‌ను నిలదీస్తారు. దీంతో డైలమాలో పడిపోయిన సిద్దార్థ్ నేను తీసుకొచ్చిన ప్రాజెక్టు ఒక మీడియేటర్ ద్వారా వచ్చింది. అంతేకానీ ఆ కంపెనీ గురించి నాకు ఎటువంటి డీటెయిల్స్ తెలియవు అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. రాజ్ తన మాటలతో అభినందిస్తాడు. దగ్గరకు వెళ్లి ఆల్‌దిబెస్ట్ చెప్పి కావ్య దగ్గరకు వెళ్లి రాజ్ గురించి ఆలోచించాను కానీ నిన్ను అంచనా వేయలేకపోయాను అంటూ వెళ్లిపోతాడు. అందరూ వెళ్లిపోయాక కావ్య , రాజ్ దగ్గరకు వెళ్లి మాకెవ్వరికి తెలియని విషయం మీకెలా తెలిసింది అని అడుగుతుంది. మీరు చెప్పిందే నేను చెప్పానండి నాకు కొత్తగా గుర్తు రావడం ఏంటి అంటాడు రాజ్. అయితే ఈయనకు మెల్లమెల్లగా గతం గుర్తొస్తుంది అన్నమాట అని కావ్య మనసులో అనుకుంటుంది.
సుభాష్‌కు ఒక బోర్డు మెంబర్ ఫోన్ చేసి ఆఫీసులో జరిగిన విషయం చెప్తాడు. దీంతో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీలవుతుంది. రుద్రాణి, రాహుల్ ఇరిటేటింగ్ గా ఫీలవుతారు. తర్వాత పక్కకు వెళ్లిన రాహుల్, రుద్రాణి బాధపడుతుంటారు. అంతా అయిపోయిందని ఇక జీవితాంతం నేను ఆ స్వప్న కాళ్ల దగ్గర కుక్కలా బతకాలి అంటూ బాధపడతాడు. మరోవైపు ఆఫీసులోంచి బయటకు వచ్చిన కావ్య ఆ యామిని రెండో ప్లాన్ ఏదో చేసిందని చెప్పింది అది నిజంగా ప్లాన్ చేసిందా..? లేక నన్ను భయపెట్టడానికి అలా చెప్పిందా అని ఆలోచిస్తుంది. ఇంతలో యామిని ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్ కావ్య నేను ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యాను. కానీ ప్లాన్ బీ లో సక్సెస్ అయ్యాను. మీ అప్పును సస్పెండ్ చేయించాను సస్పెండ్ కావడమే కాదు అరెస్ట్ కూడా అయింది. ఆఫీసును కాపాడుకునే ప్రయత్నంలో ఉండి చెల్లెలు భవిష్యత్తు గాలికి వదిలేశావేంటి..? ఈ రోజు నీ చెల్లెలు ఉద్యోగం పోవడానికి కారణం నువ్వే అంటూ వార్నింగ్ ఇస్తుంది యామిని. ఆ బాధలో ఉన్న కావ్య వెంటనే వెళ్లి రాజ్‌ను హగ్ చేసుకుటుంది. తర్వాత సారీ చెప్పి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?