EPAPER

Shreyas Iyer on KKR Winning: హైదరాబాద్ జట్టు తీసుకున్న నిర్ణయమే మాకు వరమైంది: శ్రేయాస్

Shreyas Iyer on KKR Winning: హైదరాబాద్ జట్టు తీసుకున్న నిర్ణయమే మాకు వరమైంది: శ్రేయాస్

Hyderabad Team Decision Changed the Game Said By Shreyas Iyer: ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్.. ఎంతో హోరాహోరీగా సాగుతుందనుకుంటే.. అంతా వన్ సైడ్ గా మారిపోయింది. ఇది కోల్ కతా గొప్పతనం కన్నా..హైదరాబాద్ జట్టు తీసుకున్న నిర్ణయమే.. తమకు మేలు చేసిందని కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అన్నాడు. నిజంగా మేం లక్కీ అని తెలిపాడు.


ఎందుకంటే వాళ్లు టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగు తీసుకున్నారు. అదే మాకు మేలు చేసింది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగుకి వచ్చిన ఎవరైనా అలాగే ఇబ్బంది పడేవారు. ఒకవేళ మేమే గానీ అలా ముందు వచ్చినా పిచ్ పరిస్థితుల రీత్యా అవస్థలు పడేవారమని అన్నాడు. సెకండ్ బ్యాటింగు చేసేవాళ్లకి చిన్న వెసులు బాటు దొరికిందని అన్నాడు.

ఇంతదూరం ఫైనల్ వరకు ప్రయాణించి.. ఆఖరి మెట్టుపై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఇందులో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఉందని అన్నాడు. జట్టుగా మేం కోరుకున్నది ఇదేనని అన్నాడు. అంతా కలిసికట్టుగా ఆడాలని అనుకున్నాం. ఒకరు అవుట్ అయినా, ఒకరు ముందుండి నడిపించాలని భావించాం. ఆ టీమ్ స్పిరిట్ తో ముందడుగు వేశామని అన్నాడు.


Also Read: పర్పుల్ క్యాప్ విజేత.. పంజాబ్ కింగ్.. హర్షల్ పటేల్

బౌలర్లు అత్యుత్తమ ప్రతిభ చూపించారని కొనియాడాడు. ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుని ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. వారు పెద్ద పార్టనర్ షిప్ లు బిల్డ్ కాకుండా చూసుకున్నారని అన్నాడు. ఈ విజయంలో బౌలర్లదే ప్రధాన పాత్ర అని అన్నాడు.

సన్ రైజర్స్ క్రికెట్లరు చాలా దూకుడుగా ఆడారు. మొదటి నుంచి వారి గురించి ఆందోళన చెందాం. ఎందుకంటే మొదట  ఓపెనర్స్ నుంచి కమిన్స్ వరకు అందరూ హార్డ్ హిట్టర్లే. ఒక వికెట్ తీసి, హమ్మయ్యా అనుకోవడానికి లేదని అన్నాడు. మొత్తానికి వారిని ఫైనల్ మ్యాచ్ లో కట్టడి చేయగలిగామని అన్నాడు.

Also Read: KKR Captain Shreyas Iyer: కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేరు ఎక్కడ?

ఇలాంటి మ్యాచ్ ల్లో స్టార్క్ వంటి ప్లేయర్లు ఉపయోగపడతారని అన్నాడు. ప్రారంభంలోనే వికెట్లు తీసి హైదరాబాద్ పై ఒత్తిడి పెంచాడని అన్నాడు. ఈ ఫైనల్ గెలుపులో రస్సెల్, సునీల్, హర్షిత్, వెంకటేశ్ ఇలా ప్రతి ఒక్కరూ కీలకమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుని గెలిపించారని కొనియాడాడు. మొత్తానికి ఇలాంటి రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నానని, చాలా సంతోషంగా ఉందని అన్నాడు.

Related News

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Big Stories

×