SRH VS KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో ఇవాల్టి రోజున రసవత్తర ఫైట్ జరిగింది. ఇవాల్టి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల ( Sunrisers Hyderabad vs Kolkata Knight Riders ) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో… మొదట బౌలింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా ఓడిపోయింది. అటు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించిన… కోల్కతా నైట్ రైడర్స్ జట్టు… గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇవాల్టి మ్యాచ్లో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు చేతిలో 80 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.
Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !
ఇవాళ జరిగిన మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే 16.4 ఓవర్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… 120 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ దెబ్బకు సన్రైజర్స్ హైదరాబాద్… ఏకంగా 80 పరుగుల తేడాతో ఓడిపోవలసి వచ్చింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్… రెండు విభాగాల్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమైంది. మొదటి మ్యాచ్ విజయం సాధించిన హైదరాబాద్… వరుసగా హైట్రిక్ ఓటములను చవిచూసింది.
తేలిపోయిన హైదరాబాద్ బ్యాటర్లు
మరోసారి హైదరాబాద్ బ్యాటర్లు తేలిపోయారు. ఏ ఒక్క ఆటగాడు కూడా సరిగ్గా ఆడలేదు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన క్లాసెన్ ఒక్కడు తప్ప మిగతా అందరు ప్లేయర్లు దాదాపు విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో 21 బంతులు ఆడిన క్లాసెన్… ఏకంగా 33 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. అటు ఓపెనర్ హెడ్ రెండు బంతులు ఆడి… ఒక్క బౌండరీ కొట్టి ఔట్ అయ్యాడు. అటు అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ సరిగ్గా ఆడలేదు. ఇవాళ రెండు పరుగులకే అవుట్ అయ్యాడు. అటు ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్లో సెంచరీ చేసి మెరిసి… వరుసగా విఫలమవుతున్నాడు. ఇవాళ కూడా ఐదు బంతులు ఆడి రెండు పరుగులు మాత్రమే చేశాడు ఇషాన్ కిషన్. నితీష్ కుమార్ రెడ్డి కూడా 15 బంతుల్లో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొన్న మెరిసిన అనికేత్ వర్మ… ఒక సిక్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఇలా టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడంతో హైదరాబాద్ దారుణ ఓటమి చవిచూసింది.
IPL 2025 Points Table
ఇవాల్టి మ్యాచ్ ఓటమి పాలు కావడంతో.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… పాయింట్స్ టేబుల్ లో చిట్ట చివరన నిలిచింది. అంటే పదవ స్థానంలో నిలిచింది హైదరాబాద్. నాలుగు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్ల్లో ఓడిపోయిన హైదరాబాద్ ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అటు కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు.. ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.