Big Stories

DC vs KKR Match highlights IPL 2024 : కోల్ కతాకి ఎదురే లేదు : ఢిల్లీకి ఘోర పరాజయం

DC vs KKR Match highlights IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్ లో కొన్ని జట్లు ముందుకెళుతున్నాయి. కొన్ని వెనక్కి వస్తున్నాయి. నిలకడగా వెళ్లే వాటిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఒకటిగా ఉంది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్ స్థానాన్ని పదిలం చేసుకున్నట్టుగానే కనిపిస్తోంది.

- Advertisement -

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇది వ్యూహాత్మక తప్పిదంగా మారింది. ఎందుకంటే పిచ్ బౌలింగుకి అనుకూలంగా ఉండటంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో కోల్ కతా 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలో 157 పరుగులు చేసి విజయ దుందుభి మోగించింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన కోల్ కతాకి ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్ (15) త్వరగా అయిపోయాడు. అయితే మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ మాత్రం ఎలాంటి తత్తరపాటు లేకుండా ఫటాఫట్ దంచి కొట్టాడు. 33 బంతుల్లో 5 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రింకూసింగ్ (11) నిరాశపరిచాడు.

Also Read : హైదరాబాద్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ వింతలు, విశేషాలు

అప్పటికి 9.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 100 పరుగులతో ఉంది. పిచ్ ఏమైనా స్పిన్నర్లకి మారుతుందా? అనే అనుమానాలు అందరిలో వచ్చాయి. ఎందుకంటే మరి టాస్ గెలిచిన రిషబ్ పంత్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు అందుకేనేమో అనుకున్నారు. కానీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జాగ్రత్తగా ఆడాడు. 23 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకి వెంకటేష్ అయ్యర్ (26) సపోర్ట్ గా నిలిచాడు. మొత్తానికి 16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఢిల్లీ బౌలింగులో అక్షర్ పటేల్ 2, విలియమ్స్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఓపెనర్లు ఆదిలోనే అవుట్ అయిపోయారు. ప్రథ్వీ షా (13), జేక్ ఫ్రేజర్ (6) త్వరగా అయిపోయారు. తర్వాత వచ్చిన అభిషక్ పోరెల్ (18), షాయ్ హోప్ (6) వెంటవెంటనే పడిపోవడంతో ఢిల్లీ ఇంక కోలుకోలేక పోయింది. 6.4 ఓవర్లకే 4 వికెట్లు పడిపోయాయి. అప్పటికి స్కోరు 68 మీద ఉంది.

తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ కాసేపు (27) వికెట్ల పతనాన్ని ఆపాడు. కానీ ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. అక్షర్ పటేల్ (15) కూడా అదే పరిస్థితి. ఇక ట్రిస్టన్ స్టబ్స్ (4), కుమార్ కుశాగ్ర (1), రశిక్ సలాం (8) వెంట వెంటనే అయిపోయారు. ఇలా 14.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులతో పతనావస్థలోకి వెళ్లిపోయింది.

కులదీప్ యాదవ్ 26 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందులో ఒక సిక్స్, 5 ఫోర్లు ఉన్నాయి. తనే హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. మొత్తానికి 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కులదీప్ దయవల్ల లోయస్ట్ స్కోరు కాకుండా పరువు నిలబెట్టుకుంది.

కోల్ కతా బౌలింగులో మిచెల్ స్టార్క్ 1, వైభవ్ 2, హర్షిత్ రాణా 2, సునీల్ నరైన్ 1, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News