Kris Srikkanth: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేయబోతున్నాడు ఈ కుర్రాడు వైభవ్ (Vaibhav Sooryavanshi). ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఐపీఎల్ తరహాలోనే అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తాడని అందరూ అంటున్నారు. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేయాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా క్రిస్ శ్రీకాంత్ (Krishnamachari Srikkanth ) కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. వైభవ్ గనుక టెస్ట్ క్రికెట్ లోకి వస్తే… ఆ ఫార్మాట్ కు ఆదరణ పెరుగుతుందని వెల్లడించారు. వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడితే, క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే వెంటనే టెస్టుల్లోకి వైభవ్ సూర్య వంశీని తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా బీసీసీఐ అడుగులు వేయాలన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ అతిత్వరలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ తో జరిగే టి20 సిరీస్ ఆడే అవకాశం వైభవ్ దక్కించుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ లోకి కూడా అతన్ని తీసుకోవాలని క్రిస్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడితే మాత్రం… టీవీలకే జనాలు అతుక్కుపోతారని వెల్లడించారు.
సిక్సర్లు బౌండరీలతో టెస్ట్ మ్యాచ్లను కూడా అలరిస్తాడని పేర్కొన్నారు. అలా సిక్సర్లు లేదా బౌండరీలు ఆడుతూ వైభవ్ సెంచరీల మీద సెంచరీలు చేస్తే… జనాలకు టెస్ట్ క్రికెట్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుందని సూచనలు చేశారు. బ్రియాన్ లారా 400 పరుగులు సాధించాడు ఓకే.. అది ఒక్కప్పటి మాట, వైభవ్ సూర్యవంశీ వస్తే మాత్రం 500 కొట్టడం గ్యారంటీ అని ఛాలెంజ్ విసిరారు. ఒక్క మ్యాచ్ లో కాదు… ప్రతి మ్యాచ్ లోను అలాగే అతడు ఆడతాడని వెల్లడించారు. వైభవ్ దెబ్బకు టెస్ట్ క్రికెట్ కు పూర్వ వైభవం రావడం గ్యారంటీ అన్నారు.
టీ20 లు, ఐపీఎల్ కంటే తనకు టెస్ట్ క్రికెట్ ఆడడమే అంటూ అప్పట్లో వైభవ్ సూర్యవంశీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన తండ్రి కోరిక మేరకు కచ్చితంగా టెస్ట్ క్రికెట్లో ఆడతానని వ్యాఖ్యానించారు. ఆ దిశగా అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. బీసీసీఐ తనకు అవకాశం ఇస్తే మాత్రం, సద్వినియోగం చేసుకుంటానని వెల్లడించారు.