E-Paper
Advertisement

ఢిల్లీకి సీఏం విజయ్.. ‘జననాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

ఢిల్లీకి సీఏం విజయ్.. ‘జననాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..?
Advertisement

Vijay Thalapathy : కోలీవుడ్ స్టార్ హీరో, సీఏం విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. హీరో గతంలో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన ఇప్పటివరకు నటించిన సినిమాకు విడుదల విషయంలో కాస్త జాప్యం ఏర్పడింది.. కానీ విజయ్ చివరగా నటించిన జననాయగన్ మూవీకి విడుదల గండం పట్టుకుంది. ఆ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది.. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతో ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చెయ్యలేదు.. ఈ హీరో రాజకీయాల్లోకి రాకముందు నటించిన చివరి సినిమా కావడంతో దీనిపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా సీఏం విజయ్ ఈ మూవీ కోసం ఢిల్లీకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే..

‘జన నాయగన్ ‘ కోసం ఢిల్లీకి సీఎం విజయ్..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి రాకముందు చేసిన చివరి సినిమా ఇదే.. ఈ మూవీ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చాలా స్మూత్ గా జరిగిపోయింది.. ఎటు తిరిగీ సెన్సార్‌ విషయంలోనే పీట ముడిపడింది. నిజానికి హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ దగ్గర సమస్య అవుతుందని ఎవరు ఊహించలేదు.. శాసనసభ ఎన్నికల సమయం కావడం, నటుడు విజయ్‌ పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవ్వడమే ఈ చిత్రానికి అడ్డుగా మారింది. గత ఆరు నెలలుగా ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాలేదు. ఈ మూవీ ని ఎప్పుడెప్పుడా అని చూస్తామని విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అయితే సెన్సార్ సభ్యులను నేరుగా కలిసి సర్టిఫికెట్ గురించి మాట్లాడేందుకు సీఎం విజయ్ ఢిల్లీకి వెళ్ళినట్లు తెలుస్తుంది. మరి సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read :సమంత ‘ మా ఇంటి బంగారం ‘ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

జూన్ 25 న సినిమా రిలీజ్?

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి, హెచ్ వినోద్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం జన నాయగన్.. చిత్రం విడుదలకు కొన్ని నెలలుగా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకుని కారణాలవల్ల సినిమా సెన్సార్ దగ్గర ఆగిపోయింది. సినిమాలో నటించిన విజయ్ దళపతి సీఎంగా పదవి బాధ్యతలను చేపట్టారు.. అయినా కూడా ఈ సినిమా విడుదలకు మోక్షం కలగలేదు.. చివరికి ఈనెల 25 లేదా 26, లేదంటే జులై మూడున ఈ సినిమా విడుదలవుతుంది అని సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు చూస్తే సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించలేదు. ఢిల్లీకి వెళ్లిన సీఎం విజయ్ దీనిపై సెన్సార్ బోర్డు సభ్యులతో మాట్లాడితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం తమిళ సినీ అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు అభిమానులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు..

Related News

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

వెండితెర పైకి ‘రఘుకుల తిలకరారా’ సాంగ్..

భూ కబ్జా వ్యవహారం.. నిర్మాత సి కళ్యాణ్ పై పోలీస్ కేసు నమోదు!

Big Stories

Advertisement
×