E-Paper
Advertisement

అతిగా వేళ్లు, మెడ ఇరుచుకొనే.. అలవాటు ఉన్నవాళ్లు ఎలాంటివాళ్లో తెలుసా? మీరు నమ్మలేరు

అతిగా వేళ్లు, మెడ ఇరుచుకొనే.. అలవాటు ఉన్నవాళ్లు ఎలాంటివాళ్లో తెలుసా? మీరు నమ్మలేరు
Advertisement

Cracking knuckles and neck: ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైనా, ఏదైనా విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నా చాలా మంది తెలియకుండానే చేతి వేళ్లను టపటపా ఇరుస్తుంటారు. మరి కొందరు మెడను అటు ఇటు తిప్పుతూ శబ్దాలు చేస్తుంటారు. దీన్ని కేవలం ఒక సాధారణ శారీరక అలవాటుగా మాత్రమే మనం చూస్తాం. కానీ.. సైకాలజీ ప్రకారం దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. పెద్ద వాళ్లలో తరచూ వేళ్లు, మెడ ఇరిచే అలవాటు ఉండటం అనేది వారు తమ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి , కోల్పోయిన కంట్రోల్‌ను తిరిగి తెచ్చుకోవడానికి చేసే.. ప్రయత్నమని నిపుణులు చెబుతున్నారు.

వేళ్లు, మెడ ఎందుకు ఇరుస్తారు? సైకాలజీ ఏం చెబుతోంది?

Advertisement

మనం ఖాళీగా కూర్చున్నప్పుడో లేక ఏదైనా టెన్షన్ పడుతున్నప్పుడో చేతి వేళ్లను విరవడం చాలా సహజంగా చూస్తుంటాం. చిన్న వయసులో ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్లు తిట్టడం కూడా మనకు గుర్తే ఉంటుంది. అయితే.. వయసు పెరిగిన తర్వాత కూడా చాలా మందిలో ఈ అలవాటు అస్సలు మానదు. సైకాలజీ ప్రకారం, పెద్దవాళ్లు తమ వేళ్లను లేదా మెడను పదే పదే ఇరవడం వెనక కేవలం సోమరితనం లేదా బోర్ కొట్టడం మాత్రమే కారణం కాదు. ఇది ఒక వ్యక్తి అంతర్గతంగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ఉపయోగపడే ఒక రక్షణ కవచం లాంటిదని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మానవ శరీరం ఒత్తిడికి లోనైనప్పుడు, అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. దీని వల్ల కండరాలలో తెలియకుండానే ఒక రకమైన బిగుతు లేదా ఉద్రిక్తత ఏర్పడుతుంది. ముఖ్యంగా చేతి వేళ్ల కీళ్లలో, మెడ భాగంలో.. ఈ ఒత్తిడి ఎక్కువగా పేరుకుపోతుంది. ఎప్పుడైతే మనం వేళ్లను లేదా మెడను ఇరుస్తామో, అప్పుడు ఆ కీళ్ల మధ్య ఉండే గ్యాస్ బుడగలు పగిలి ఒక రకమైన శబ్దం వస్తుంది. ఈ ప్రక్రియ శారీరకంగా కండరాలకు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా.. మెదడుకు కూడా ఎండార్ఫిన్లు అనే ఫీల్-గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. దీని వల్ల మనసుకు తక్షణమే కాస్త ప్రశాంతత లభించినట్లు అనిపిస్తుంది.

Advertisement

అంతే కాకుండా.. జీవితంలో లేదా ఆఫీసు పనిలో ఏదైనా మన చేతుల్లో లేదు అనుకున్నప్పుడు, లేదా పరిస్థితులు గందర గోళంగా మారినప్పుడు మనుషులు తీవ్ర మైన అసహనానికి లోనవుతారు. అలాంటప్పుడు తమ శరీరంపై, చుట్టు పక్కల వాతావరణంపై మళ్లీ కంట్రోల్ సాధించడానికి మెదడు ఇలాంటి శారీరక కదలికలను ప్రేరేపిస్తుంది. వేళ్లు విరవడం ద్వారా వచ్చే ఆ శబ్దం ,ఆ అనుభూతి, సబ్-కాన్షియస్ లెవెల్‌లో ఒక రకమైన భద్రతా భావాన్ని , ప్రశాంతతను చేకూరుస్తాయి. అందుకే.. యాంగ్జైటీ, టెన్షన్ ఎక్కువగా ఉన్నవారు తెలియకుండానే ఈ పని చేస్తుంటారు.

Also Read: రూ.2 వేలలోపు ‘బోట్’మ్యాజిక్.. రూ.4 వేల బడ్జెట్‌లో ‘వన్‌ప్లస్’ అరాచకం.. ఏది బెస్ట్?

టెక్నికల్‌గా దీనిని సైకాలజీలో ‘సెల్ఫ్-స్టిమ్యులేషన్’ లేదా ‘ఫిడ్జెటింగ్’ అని పిలుస్తారు. గోళ్లు కొరకడం, కాళ్లు ఊపడం లాగే.. ఇది కూడా ఒక రకమైన మానసిక ఉపశమన చర్య. అయితే, ఈ అలవాటు మానసిక ఒత్తిడిని తాత్కాలికంగా తగ్గించడానికి సహాయపడినప్పటికీ, పదే పదే మెడను గట్టిగా ఇరవడం లేదా వేళ్లను అతిగా విరవడం వల్ల కాలక్రమేణా కీళ్లపై, నరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్ హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ మీకు కూడా ఈ అలవాటు చాలా ఎక్కువగా ఉంటే.. మీరు తీవ్రమైన ఒత్తిడిని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయంగా.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి బ్రీతింగ్.. ఎక్సర్‌సైజులు చేయడం, చిన్న స్ట్రెస్ బాల్స్ వాడటం లేదా కాసేపు నడవడం వంటి అలవాట్లను అలవర్చుకోవడం మంచిది.శారీరక అలవాట్ల వెనక ఉండే మానసిక కారణాలను గుర్తించి, ఒత్తిడికి గల అసలు మూలాలను సరి చేసుకోవడమే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం.

Related News

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×