BigTV English

Virat Kohli Leaving for London Forever: విరాట్ శాశ్వతంగా లండన్ వెళ్లిపోతున్నాడా?

Virat Kohli Leaving for London Forever: విరాట్ శాశ్వతంగా లండన్ వెళ్లిపోతున్నాడా?

Is Virat Kohli Leaving for London Forever: టీమ్ ఇండియాకు వెన్నుముకలాంటి విరాట్ కొహ్లీ శాశ్వతంగా ఇండియా వదిలి వెళ్లిపోతున్నాడనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇండియా వదిలి ఎక్కడికి వెళతాడని కొందరంటుంటే, ఇదిగో సాక్షాలని అంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవల విరాట్ కొహ్లీ-అనుష్క దంపతులకు అకాయ్ కొహ్లీ పుట్టాడు. అనుష్క డెలివరీ కోసం వీళ్లు లండన్ వెళ్లారు. అక్కడ నుంచి లండన్ ప్రయాణం మొదలైంది.


వన్డే వరల్డ్ కప్ 2023 అయిన వెంటనే ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. సరిగ్గా అదే సమయంలో ప్రాక్టీసు కోసం వచ్చిన విరాట్ కొహ్లీ ఇమ్మీడియట్ గా లండన్ వెళ్లిపోయాడు. అయితే ఎక్కడికి వెళ్లాడనేది చాలాకాలం ఎవరికీ తెలీలేదు. చివరికి లండన్ లో ముసుగువీరుడిలా ఒకరోజు కనిపించాడు. అయితే తనకి కొడుకు పుట్టాడని, తమకు ప్రైవసీ కావాలని కోరుకున్నాడు. ఇక అప్పటి నుంచి తన జోలికి ఎవరూ వెళ్లడం మానేశారు.

మొన్న టీ 20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత, ముంబయిలో సంబరాలు మొదలయ్యాయి. అనంతరం ప్రధాని మోదీతో సమావేశమైంది. అదేరోజు సాయంత్రం ఇమ్మీడియట్ గా విరాట్ కొహ్లీ లండన్ ఫ్లయిట్ ఎక్కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తన ప్రపంచం అంతా భార్యాపిల్లల చుట్టే ఉందని నమ్ముతున్నాడని జనం అంటున్నారు. అయితే ఇండియా వస్తుంటే, చుట్టూ ప్రజలు గుమిగూడి పోవడం, వారికి ప్రైవసీ లేకపోవడంతో మానసికంగా వారు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.


విరాట్ కొహ్లీ కూడా ప్రజల నుంచి విపరీతమైన ప్రేమను కాదనలేకపోతున్నాడు. అలాగని వారి మధ్య నుంచి బలవంతంగా బయటకు రావడం, ఈ క్రమంలో వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది వారిపై చేయి చేసుకోవడం, ఇంటి ముందు ప్రజలు పడిగాపులు కాయడం… ఇవన్నీ నచ్చడం లేదని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. వీటన్నింటి ద్రష్ట్యా ఏకంగా వాళ్లు లండన్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అందుకోసమని విరాట్ దంపతులు అక్కడ ఒక ఇల్లు కూడా కొన్నారని సమాచారం.

Also Read: నెంబర్ వన్ ఆటగాడు సిన్నర్, పారిస్ ఒలింపిక్స్‌కు దూరం

ఇటీవల టీ 20 ప్రపంచకప్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ నేను క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత మీకెవరికి కనిపించకుండా వెళ్లిపోతానని అనడం కూడా నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ముంబయి నుంచి ఇంపార్టెంట్ వస్తువులు కూడా లండన్ కి షిఫ్ట్ చేశారని అంటున్నారు. అంతేకాదు అకాయ్ పుట్టిన దగ్గర నుంచి వీరు లండన్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. అందుకు నిదర్శనంగా అనుష్క, విరాట్ దంపతులు లండన్ లోనే ఉన్నట్టుగా ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. దీంతో కొహ్లీ అభిమానులు విచారంతో ఉన్నారు.

ఈ విషయంపై నెట్టింట పెద్ద డిస్కర్షన్ నడుస్తోంది. అలాగైతే సచిన్ టెండుల్కర్ ఇండియాలో లేడా? కొహ్లీ కన్నా పెద్ద సెలబ్రిటీ కదా అంటున్నారు. కపిల్ దేవ్, ధోనీ, గవాస్కర్ వీరందరూ ఇండియాలోనే ఉన్నారు కదా…ఓవరాక్షన్ కాకపోతేననే విమర్శలు వినిపిస్తున్నాయి. అవసరం తీరిన తర్వాత, జన్మభూమిని మరిచిపోవడం సరికాదని కొందరు ఘాటుగానే విమర్శిస్తున్నారు. మొత్తానికి విరాట్, అనుష్క దంపతులు నెటిజన్లకు పెద్ద పనే పెట్టారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×