Ban On Krunal Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) నేపథ్యంలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. అంపైర్ల తప్పుడు నిర్ణయాలు, క్యాచ్ వివాదాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ప్రతి మ్యాచ్ లో కలకలం రేపుతున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. దానికి తగ్గట్టుగానే కళ్ళకు కట్టినట్లు సంఘటనలు కూడా ఉంటున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( Royal Challengers Bengaluru) ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా బ్రదర్ కృనాల్ పాండ్యాపై ( Krunal Pandya) వేటుపడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిపై మూడు నెలల బ్యాన్ కూడా విధించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఉస్మాన్ తారిక్ ( usman tariq)తరహాలోనే కృనాల్ పాండ్యా బౌలింగ్ ( Krunal Pandya bowling ) చేస్తున్నాడని బీసీసీఐకి ముంబై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. మూడు నెలల బ్యాన్ ( Ban On Krunal Pandya) విధించే అవకాశాలు ఉన్నట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: Akhtar On Naqvi: భూతద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విషయంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ సరిపోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Mumbai Indians vs Royal Challengers Bangalore ) జట్ల మధ్య ఈనెల 12వ తేదీన బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ పైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పరుగులు తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా బౌన్సులతో ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించాడు. హార్దిక్ పాండ్యాకు కూడా బౌన్సర్లు సంధించి ఇబ్బంది పెట్టాడు. అయితే అతని వల్ల ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) నష్టపోయిందని చెప్పవచ్చు.
అతడు అలాంటి బంతులు వేయకుండా సాధారణ బౌలింగ్ చేస్తే, ముంబై ఇండియన్స్ గెలిచేదని అంబానీ ( Ambani) ఫ్యామిలీ బిగ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కృనాల్ పాండ్యా ( Krunal Pandya) బౌలింగ్ యాక్షన్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలికి ( BCCI ) ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన బీసీసీఐ అధికారులు, కృనాల్ పాండ్యాపై ( Krunal PAndya) 3 నెలల పాటు బ్యాన్ విధించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆటగాడు ఉస్మాన్ తారిక్ తరహాలోనే కృనాల్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడని ముంబై ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ చర్యలు బీసీసీఐ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. దీంతో అంబానీ ఫ్యామిలీపై బెంగళూరు అభిమానులు సీరియస్ అవుతున్నారు.
Also Read: Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ కు కూడా లవ్ స్టోరీ…ఔట్ కాగానే కన్నీళ్లు పెట్టుకుంది కదరా
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==