BigTV English

ICC – Google : మహిళల క్రికెట్ కోసం రంగంలోకి గూగుల్… జై షాతో పెద్ద డీలింగే

ICC – Google : మహిళల క్రికెట్ కోసం రంగంలోకి గూగుల్… జై షాతో పెద్ద డీలింగే

ICC – Google : మహిళల క్రికెట్ కోసం రంగంలోకి గూగుల్ దిగనుంది. ముఖ్యంగా ఉమెన్ క్రికెట్ ను గ్లోబల్ ప్రమోట్ చేసేందుకు గూగుల్ సంస్థతో ఐసీసీ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఎక్కువ మందికి ఉమెన్ క్రికెట్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025, ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్ 2026 ఈవెంట్లను ప్రమోట్ చేయడంలో ఈ పార్ట్ నర్ షిప్ కీలకంగా వ్యవహరించనుంది. ఆండ్రాయిడ్, గూగుల్ జెమినీ, గూగుల్ పిక్సెల్, గూగుల్ పే వంటి సర్వీసెస్ ద్వారా ఉమెన్ క్రికెట్ ను ప్రమోట్ చేయనున్నారు. రాబోయే 10 నెలల్లో రెండు ప్రధాన గ్లోబల్ ఈవెంట్ లు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ.. గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది.


Also Read :  T-20 Records : టీ-20 చరిత్రలోనే తోపు బౌలర్లు.. వీళ్లు వేసిన ఓవర్లు అన్ని మెయిడీన్లే..!

గూగుల్ తో ఐసీసీ కీలక ఒప్పందం.. 


ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ శ్రీలంక, భారత్ లో.. అలాగే ఐసీసీ మహిళల టీ-20 వరల్డ్ కప్ 2026 ఇంగ్లాండ్-వేల్స్ లో జరుగనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రపంచ మహిళా మొదటి భాగస్వామిగా యూనిలీవర్ ను ప్రకటించింది. ఆ తరువాత ఇప్పుడు గూగుల్ తో ఒప్పందం కీలకంగా మారింది. మహిళా క్రికెట్ మరింత డైనమిక్ గా చేసేందుకు ఆండ్రాయిడ్, గూగుల్ జెమినీ, గూగుల్ పే, గూగుల్ ఫిక్సెల్ సహా పలు గూగుల్ ఉత్పత్తులు వంటి ప్రమోట్ చేయనున్నారు. గూగుల్ తో చేసుకున్న ఈ ఒప్పందం మహిళల క్రికెట్ ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు తోడ్పాటునిస్తుంది. గూగుల్ తో భాగస్వామ్యం మహిళా క్రికెట్ కి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సహాయపడుతుందని ఐసీసీ చైర్మన్ జైషా కూడా వెల్లడించారు.

టీమిండియా ఉమెన్స్ క్రికెట్ మరింత అభివృద్ధి

” గూగుల్ ప్రపంచ స్థాయి ఆవిష్కరణను ఉపయోగించడంతో భారతీయ మహిళల క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రచారం పొందుతుంది. పలు అనుభవాలను సృష్టించగలం. ప్రతీ చోటా ప్రజలకు క్రీడలను మరింత చేరువ చేయగలం.  దీంతో మహిళా క్రికెట్ మునుపెన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ సహకారం దాని ప్రపంచ స్థాయిని వేగవంతం చేయడంలో సహాయపడటమే కాకుండా భవిష్యత్ తరాలకు క్రికెట్‌ని ఒక గేమ్‌గా చూసేందుకు ప్రేరేపిస్తుంది. గూగుల్ తో కలిసి మేము మహిళల క్రికెట్ ను నిజమైన ప్రపంచ శక్తిగా మార్చాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలోనే టీమిండియా ఉమెన్స్ క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పెంచుకుంటుంది” అని ఐసీసీ చైర్మన్ జైషా వెల్లడించారు. ఇక మహిళల క్రికెట్ కి గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ మెన్స్ క్రికెట్ ఎవ్వరితో ఒప్పందం కుదుర్చుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. డ్రీమ్ 11 ఇప్పటికే తప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు సెప్టెంబర్ 09 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇంకా టీమిండియా స్పాన్సర్ షిప్ ఖరారు కాకపోవడంతో టీమిండియా అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

 

Tags

Related News

Harbhajan- Sreesanth : హర్భజన్, శ్రీశాంత్ మధ్య పుల్ల పెట్టిన లలిత్ మోడీ.. 18 ఏళ్ల గాయాన్ని తెరపైకి తీసుకువచ్చి

T-20 Records : టీ-20 చరిత్రలోనే తోపు బౌలర్లు.. వీళ్లు వేసిన ఓవర్లు అన్ని మెయిడీన్లే..!

Hyderabad Flyovers : మెట్రో పిల్లర్లకు టీమిండియా ప్లేయర్ల ఫోటోలు… ఎక్కడంటే

Asia Cup 2025: ఆసియా కప్ కంటే ముందే టీమిండియా ప్లేయర్లకు గంభీర్ అగ్నిపరీక్ష… సెప్టెంబర్ 5 నుంచి ఆట షురూ

Harshit Rana : గంభీర్ రాజకీయాలు.. వీడొక్కడికే అన్ని ఫార్మాట్ లో ఛాన్స్.. తోపు ఆటగాళ్లకు అన్యాయమే

Big Stories

×