BigTV English

Jana Nayagan : సినిమా సంక్రాంతి కే, కానీ తలపతి ఫ్యాన్స్ కు దివాళి తో పండగ మొదలుకానుంది

Jana Nayagan : సినిమా సంక్రాంతి కే, కానీ తలపతి ఫ్యాన్స్ కు దివాళి తో పండగ మొదలుకానుంది

Jana Nayagan : శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు తలపతి విజయ్. హిందీ సినిమా త్రీ ఇడియట్స్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. శంకర్ మొదటిసారి ఒక సినిమాను రీమేక్ చేయడం. మొత్తానికి ఈ సినిమా తెలుగులో కూడా మంచి ఆదరణ సాధించుకుంది.


ఈ సినిమా ప్రమోషన్స్ కి విజయ్ హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా కోసం కూడా హైదరాబాద్ వచ్చారు. వాస్తవానికి ఈ రెండు సినిమాలు బానే ఆడాయి. అప్పటినుండి విజయ్ నటిస్తున్న కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల చేస్తూనే వచ్చారు. అయితే తన సినిమా ప్రమోషన్స్ కి విజయ్ కంప్లీట్ గా హైదరాబాద్ రావడం మానేశారు.

సొంత సినిమాకే రాలేదు 


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వంశీ పైడిపల్లి దర్శకుడిగా విజయ్ హీరోగా వారసుడు అనే సినిమాను నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పూర్తి స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమా మాత్రం మంచి ప్రాఫిట్ సే కొంత వరకు తెచ్చింది అని సమాచారం. అయితే ఈ సినిమా కోసం హైదరాబాద్ కి వచ్చి విజయ్ ప్రమోట్ చేస్తాడు అని దిల్ రాజు ఊహించారు. కానీ ఈ సినిమా కోసం కూడా రాలేదు.

దివాలి కు పండగే 

మామూలుగా తమిళ్ సినిమాలు ఎక్కువగా దివాలి కానుకగా విడుదల అవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. దివాళికి ఈ సినిమా నుంచి ఒక కచేరి సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మమిత బైజు, పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ పాట ఆకట్టుకుంటుంది అని తెలుస్తుంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

తెలుగు కొరియోగ్రాఫర్స్ హవా 

ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది తమిళ్ కొరియోగ్రాఫర్స్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో పనిచేసేవాళ్ళు. తెలుగు కొరియోగ్రాఫర్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలుగు కొరియోగ్రాఫర్స్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. శివ కార్తికేయన్ నటించిన మదరాశి సినిమాలో ఒక పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆ సాంగ్ మంచి హిట్ అయింది. ఇప్పుడు విజయ్ తో సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ కూడా తమిళ్ స్టార్ హీరోలతో చాలాసార్లు పనిచేశారు.

Also Read: Mowgli Glimpse : మోగ్లీ బంగారు ప్రేమ కథ… సుమ కొడుకు బానే కష్టపడ్డాడు

Related News

Sobhita Dhulipala: గుడ్ న్యూస్ ప్రకటించిన అక్కినేని కోడలు.. ట్రోల్స్ వైరల్!

Sandeep Reddy Vanga: గొప్ప మనసు చాటుకున్న సందీప్.. సీఎం సహాయనిధికి భారీ నజరానా?

OG Movie : పవన్ కళ్యాణ్ ఓజీలో బిగ్ ట్విస్ట్.. సినిమాలో రాధిక అక్క క్యామియో ?

Janhvi Kapoor: నా పెళ్లి అయిపోయింది.. అతనే నా భర్త అంటున్న జాన్వీ కపూర్

Sunny Leone: సన్నీకి ప్రెగ్నెన్సీ అస్సలు వద్దు… కానీ పిల్లలు కావాలంట… అందుకే అలా!

Big Stories

×