Sunny Leone: సన్నీలియోన్(Sunny Leone) సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా సినిమాలలో నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా సినీ ఇండస్ట్రీలో ఒక సమయంలో ఓ వెలుగు వెలిగిన సన్నిలియోన్ ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇక ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటారు.
ముగ్గురు పిల్లల తల్లిగా సన్నీలియోన్..
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీలియోన్ పిల్లల గురించి ప్రెగ్నెన్సీ(Pregnancy) గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సన్నీలియోన్ ఇప్పటికే ముగ్గురు పిల్లలకు అమ్మగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒక అనాధను దత్తత తీసుకొని సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. అదేవిధంగా మరో ఇద్దరు పిల్లలకు సరోగసి ద్వారా అమ్మగా మారిన సంగతి తెలిసిందే. ఇలా ముగ్గురు పిల్లలకు తల్లిగా ఉంటున్న సన్నీలియోన్ తాజాగా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ తనకు ప్రెగ్నెన్సీ అసలు ఏమాత్రం నచ్చదని తెలిపారు. ప్రెగ్నెన్సీని తను ఇష్టపడకపోయినా పిల్లలుంటే చాలా ఇష్టమని అందుకే సరోగసి ద్వారా పిల్లలకు తల్లిగా మారాను అంటూ ఈమె అసలు విషయాన్ని తెలియజేశారు.
ఐవీఎఫ్ ఫెయిల్యూర్..
ఇకపోతే ఈమె ప్రెగ్నెన్సీ అంటే చిరాకు పడటానికి కారణం లేకపోలేదు ప్రెగ్నెన్సీ కోసం మొదట్లో ఎన్నో సందర్భాలలో ఐ వి ఎఫ్ (IVF)చేయించుకున్నారని అయితే ఐవీఎఫ్(IVF) చేయించుకున్న ప్రతిసారి ఫెయిల్యూర్ కావడమే కాకుండా తన ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయిందని సన్నీ లియోన్ గుర్తు చేసుకున్నారు. ఇలా తన ఆరోగ్యం పాడవుతున్న నేపథ్యంలోనే ఐవిఎఫ్ అంటే చిరాకుతో సరోగసి ద్వారా పిల్లలకు తల్లిగా మారిపోయానని తెలిపారు.
?igsh=MXBnYzkyZm9ra2hweg%3D%3D
ఇక తనకు ప్రతిసారి ఫెయిల్యూర్ కావడంతోనే దత్తత కోసం అప్లై చేసుకున్నాము. ఇక సరో గెట్ మదర్ కోసం భారీగా ఖర్చు చేశానని నేను చెల్లించిన డబ్బుతో ఆమె సొంత ఇల్లు కొనుక్కొని, మళ్లీ పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయిందనే విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు సరోగసి ద్వారా పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. అయితే వారి అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని సరోగసి ద్వారా తల్లిదండ్రులుగా మారారే తప్ప తమ అందం గురించి ఆలోచించి కాదని పలు సందర్భాలలో వెల్లడించారు. ఇక సౌత్ ఇండస్ట్రీలో నయనతార కూడా సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈమెకు పిల్లలు పుట్టారనే విషయం తెలియడంతో అప్పట్లో పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఇక మంచు లక్ష్మి ప్రసన్న కూడా సరోగసి ద్వారా ఒక బిడ్డకు తల్లిగా మారిపోయారు.
Also Read: Anchor Suma: సుమ కొడుకు రోషన్ చిన్నప్పటి నిక్ నేమ్ అదేనా..అలా ఎలా సింక్ అయ్యింది భయ్యా!