Tom Bailey- Mobile: సాధారణంగా క్రికెట్ రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో కొన్ని ఆసక్తికర సంఘటలు ఉంటాయి. కొన్ని అస్సలు ఊహించనివి ఉంటే.. మరికొన్ని ఫన్నీవి.. సిల్లివి.. కొన్ని వివాదాలు ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా కౌంటీ ఛాంపియన్ షిప్‌లో లంకాషైర్, గ్లౌసెస్టర్‌షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ సమయంలో లంకాషైర్ బ్యాటర్ టామ్ బెయిలీ జేబులో మొబైల్ ఫోన్‌తో మైదానంలోకి వచ్చాడు. ఈ సంఘటన తర్వాత మ్యాచ్ సమయంలో బ్యాటర్ మొబైల్ ఫోన్‌తో మైదానంలోకి ఎలా రాగలడని సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్లు వస్తున్నాయి.
Also Read : Riyan Parag: వరుసగా 6 సిక్సర్లు… అనన్య, సారా అలీ ఖాన్ పై కోపంతో రెచ్చిపోయిన రియాన్ పరాగ్
ఇంగ్లండ్ లో ఇటీవలే జరిగిన కౌంటీ ఛాంపియన్ షిప్ మ్యాచ్ ఈ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బ్యాటర్ టామ్ బెయిలీ మొబైల్ ఫోన్ ను మైదానంలోకి తీసుకెల్లాడు. డబుల్ రన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతని జేబులోంచి జారీపోయి కింద పడింది. బ్యాటింగ్ సిద్ధమవుతున్నప్పుడు పొరపాటున దానిని మైదానంలోకి తీసుకెల్లాడు. గ్లౌసెస్టర్ షైర్ బౌలర్ జోష్ పిచ్ నుంచి ఫోన్ తీయడంతో ఫోన్ జారిపోవడాన్ని బెయిలీ అసలు గమనించలేదు. ఫోన్ అంపైర్ కి తిరిగి వచ్చిందా లేదా ఆ తరువాత మల్లీ డ్రెస్సింగ్ రూమ్ కి పంపించారా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. అసలు పిచ్ లో ఏం జరిగిందో తెలియనట్టే కనిపించాడు బెయిలీ. దీంతో కామెంటర్స్ నవ్వారు. ప్రొఫెషనల్ క్రికెట్ లో ఇలాంటి ఘటన జరగడం చాలా అరుదైన దృశ్యం.
టామ్ బెయిలీ ఇన్నింగ్స్ ప్రారంభంలో ఈ ఆసక్తి పరిణామం చోటు చేసుకున్నప్పటికీ.. ఈ మ్యాచ్ లో అతను 31 బంతులను ఎదుర్కొని 22 పరులతో నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ 10వ స్థానానికి చేరుకుంది. జట్టు 400 మార్క్ కి చేరుకున్న తరువాత లంకాషైర్ మొదటి ఇన్నింగ్స్ మొత్తం 450కి చేరుకోవడానికి సహాయ పడింది. అలాగే ఈ మ్యాచ్ లో బెయిలీ కొత్త బంతితో బౌలింగ్ ను ప్రారంభించాడు. 97 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న టాప్ ఆర్డర్ గ్లౌసెస్టర్ షైర్ బ్యాటర్ మైల్స్ హమ్మండ్ ని ఔట్ చేసి ఒక వికెట్ కూడా తీశాడు. ఇక ఈ సీజన్ లో కౌంటీ ఛాంపియన్ గా జరిగిన మూడు సీజన్లలో ఇప్పటివరకు మూడు గేమ్ లు కూడా డ్రా నే కావడం విశేషం. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త విన్న వారు సైతం ఆశ్యర్యపోతున్నారు. అసలు క్రికెట్ స్టేడియంలోకి బ్యాటర్ ఫోన్ ఎలా తీసుకువెళ్లాడు..? తీసుకువెళ్లే సమయంలో ఎవ్వరూ చూడలేదా..? ఆ సమయంలో ఫోన్ తీసుకెల్లి జారిపడినా కానీ అతనికి సోయి లేదా అంటూ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.